'ఒక్క సీమాంధ్ర ఉద్యోగిని కూడా పనిచేయనివ్వం' | We will not allow single employee of Seemandhra in secretariat | Sakshi
Sakshi News home page

'ఒక్క సీమాంధ్ర ఉద్యోగిని కూడా పనిచేయనివ్వం'

Published Tue, May 20 2014 5:17 PM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

'ఒక్క సీమాంధ్ర ఉద్యోగిని కూడా పనిచేయనివ్వం'

'ఒక్క సీమాంధ్ర ఉద్యోగిని కూడా పనిచేయనివ్వం'

హైదరాబాద్: ఒక్క సీమాంధ్ర ఉద్యోగిని కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేయనివ్వమని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేంద్రరావు హెచ్చరించారు. విభజన కోసం అధికారులు తయారు చేసిన.. ప్రకటించిన సచివాలయ ఉద్యోగుల జాబితా అంతా తప్పుల తడకగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
నిజమైన తెలంగాణ ఉద్యోగులెవరో మేమే ప్రకటిస్తామన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల జాబితాను తాము తయారు చేస్తామన్నారు. తాము తయారు చేసిన జాబితాలో ఉన్న ఉద్యోగులు మాత్రమే తెలంగాణ సచివాలయంలో పనిచేయాలని నరేంద్రరావు అభిప్రాయపడ్డారు. సచివాలయ ఉద్యోగుల జాబితాను సరిదిద్దితే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement