హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ(సీడీపీఓ)లో ఇటీవల ఇచ్చిన 102 పోస్టింగ్‌లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు నష్టంకలిగేలా చేపట్టిన నియామకాలను రద్దు చేయాలని ఓ నిరుద్యోగి హైకోర్టును ఆశ్రయించడంతో తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని ధర్మాసనం ఈనెల 8న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొత్తగా నియమితులైన ఉద్యోగుల జాయినింగ్ రిపోర్టులను తీసుకోవద్దని కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులపై మహిళా శిశుసంక్షేమ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి. రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు.
సీడీపీఓలో తాజా పోస్టింగ్‌లు రద్దు
Published Sun, May 11 2014 1:51 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement