రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించి, పరిపాలనను గాడిలో పెట్టడంలో గవర్నర్ విఫలమయ్యారని, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు రాజ్యాంగం ప్రకారం వ్యవహరించేలా ఆయన్ను ఆదేశించాలం టూ హైకోర్టులో పిల్ దాఖలైంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించి, పరిపాలనను గాడిలో పెట్టడంలో గవర్నర్ విఫలమయ్యారని, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు రాజ్యాంగం ప్రకారం వ్యవహరించేలా ఆయన్ను ఆదేశించాలం టూ హైకోర్టులో పిల్ దాఖలైంది. సీఎం పదవికి కిరణ్‌రాజీనామా చేస్తారని ముందే తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై కేంద్రం, గవర్నర్ పట్టించుకోలేదని, దీనివల్ల పాలన స్తంభించిందంటూ న్యాయవాది గంగిశెట్టి రజనీ ఈ పిల్ వేశారు. ఇందులో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, గవర్నర్, అసెంబ్లీ స్పీకర్, సీఎస్, పీసీసీ చీఫ్ బొత్స, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.