హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెతిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ముందంజలో ఉండగా, సీమాంధ్రలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలుతో పాటు ఆంధ్ర ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో మంచి ఫలితాలను సాధిస్తోంది. ఆళ్లగడ్డ, ఎర్రగుంట్ల మున్సిపాల్టీలను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. కడప కార్పొరేషన్లో జయకేతనం ఎగురవేస్తోంది. ఇక ఊహించినట్టు కాంగ్రెస్ నామ మాత్రపు పోటీ ఇచ్చింది. ఒక్క మున్సిపాల్టీని కూడా గెలిచే అవకాశం కన్పించడం లేదు. తెలంగాణలో కరీంనగర్ కార్పొరేషన్ను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేసులో నిలిచింది.