హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఆ పార్టీ వారినే అయోమయానికి గురిచేస్తోంది. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలకు తోడు తాజాగా వీరి దృష్టి శ్రీరాముడు కొలువైన పుణ్యక్షేత్రం భద్రాచలంపై పడింది. భద్రాచలం తమదంటే తమదంటూ ఇరు ప్రాంతాల నేతలు లాబీయింగ్ మొదలెట్టారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క చాంబర్ లో ఖమ్మం నేతలు సమావేశయ్యారు.
భద్రాచలం తెలంగాణకు వచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి ఫోన్ చేసి ఈ మేరకు కోరారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాల్సిన అవసరం ఉండబోదని ప్రతిపాదించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, కేంద్ర మంత్రుల బృందానికి లేఖ రాశారు.
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సమైక్య నినాదం వినిపిస్తుండగా, ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం హైదరాబాద్ యూటీ ప్రతిపాదన, సీమాంధ్రలో భద్రాచలం కలపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలపాలంటూ కేంద్ర మంత్రి జేడీ శీలం జీవోఎంను కోరారు. తెలంగాణ బిల్లుకు 10 సవరణలు ప్రతిపాదించామని, వాటిని ఒప్పుకుంటే తెలంగాణపై తమ కెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
భద్రాచలం.. మాదంటే మాది
Published Fri, Feb 7 2014 6:09 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement