సాక్షాత్తు రాష్ట్ర రాజధాని నగరంగా ఉన్న హైదరాబాద్లోనే న్యాయవాదులు, ఉద్యోగులపై దాడులు జరుగుతున్నాయని, ఇలాగైతే హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ ఎలా ఉంటుందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ప్రశ్నించారు. తాము ఈనెల 16వ తేదీన తమ భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ కమిటీలతో తప్ప.. పార్టీ ప్రతినిధులతో చర్చలు జరపబోమని ఆయన వెల్లడించారు. సీమాంధ్ర ప్రజలకు విభజనపై సమాధానం ఇవ్వాలని ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తామని, సీమాంధ్ర ఎంపీలపై ఒత్తిడి పెంచుతామని, విభజన వద్దని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కలుస్తామని అశోక్ బాబు చెప్పారు. సోనియా గాంధీని కలవాల్సిందిగా సీమాంధ్ర ఎంపీలను కోరుతామన్నారు. పోలీసుల్లో కూడా కొందరు పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Published Thu, Sep 12 2013 2:38 PM | Last Updated on Thu, Mar 21 2024 9:11 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement