'సీమాంధ్రులు పోలింగ్లో పాల్గొంటారు' | seemandhra people to vote in ghmc polls, says trs mp vinod kumar | Sakshi
Sakshi News home page

'సీమాంధ్రులు పోలింగ్లో పాల్గొంటారు'

Published Mon, Nov 2 2015 6:30 PM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM

'సీమాంధ్రులు పోలింగ్లో పాల్గొంటారు'

'సీమాంధ్రులు పోలింగ్లో పాల్గొంటారు'

హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాల వల్ల ప్రతికూల ఫలితాలను ఇప్పటికీ అనుభవిస్తున్నామని, దీని వల్లే కొన్ని పనుల్లో జాప్యం జరిగిందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్  కుమార్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జాప్యం కావడానికి వేరే కారణాలు లేవని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్రులు ఓటు హక్కు వినియోగించుకుంటారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నాయకులు వాస్తవాలు మరిచి మాట్లాడుతున్నారని, వారి హయాంలో జరగని అభివృద్ధిని తాము చేశామని వినోద్ అన్నారు. దేశంలో ఇటీవల జరిగిన పలు ఘటనలకు నిరసనగా రచయితలు అవార్డులను తిరిగి వెనక్కి ఇవ్వడంపై స్పందిస్తూ.. ఇలా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement