హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లోని సీమాంధ్రవాసులకు భద్రత కల్పిస్తామని రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన నిజామాబాద్లో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. కేబినెట్ పరంగా సీమాంధ్రులకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. సీమాంధ్రులు ఎటువంటి అభద్రతాభావానికి లోనుకావద్దని ఆయన స్పష్టం చేశారు.
నీటి పంపిణిలో కూడా ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదన్నారు. ఓ వ్యక్తి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆందోళన చెందవద్దని ఆయన సీమాంధ్రవాసులకు సూచించారు. అన్ని ప్రాంతాల న్యాయమైన పంపిణీని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి సుదర్శన్రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ఉద్యోగులు తమ ప్రాంతాలకు వెళ్లవలసిందే అని కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. వారికి ఎటువంటి అప్షన్లు ఉండవని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో హైదరాబాద్లోని సీమాంధ్ర ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైనాయి. దాంతో సచివాలయం నుంచి సీమాంధ్రలోని మారుమూల పల్లె వరకు కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.