protects
-
భార్యను రక్షించడానికి షార్క్‌తో అండర్ టేకర్ మల్లయుద్ధం..!
డబ్ల్యూడబ్ల్యూఈ అడ్డాలో అండర్ టేకర్ పేరు తెలియని వారుండరు. రింగ్‌లోకి దిగాక ఆయన పిడిగుద్దులకు ఎదురు నిలిచేవారుండరు. ఎంత మంది ఎదురొచ్చినా నిలిచి కొట్లాడే ధైర్యశాలి. అయితే.. వారి ధైర్య సాహసాలు కేవలం రింగ్‌కే పరిమితం కాదని నిరూపించాడు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ అండర్ టేకర్. బీచ్‌లో సొరచేప నుంచి తన భార్యను కాపాడాడు. అవసరం ఎదురైనప్పుడు మనుషులతోనే కాదూ.. క్రూర జంతువులతో కూడా పొట్లాడగల ధీరత్వం రెజ్లర్ సొంతమని చెప్పకనే చెప్పాడు అండర్ టేకర్. సన్డే ఇజ్ ఫన్ డే.. ఎవరైనా కాస్త విశ్రాంతిని కోరుకుంటారు. ఉల్లాసంగా గడపాలనుకుంటారు. అలాగే అండర్ టేకర్ దంపతులు కూడా బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన భార్య మిచెల్ మెక్కూల్ సముద్రంలోకి దిగారు. అండర్ టేకర్ బీచ్ ఒడ్డున ఓ పుస్తకం చదువుతున్నారు. ఈ సమయంలో మెచెల్కు సమీపంగా ఓ సొరచేప వచ్చింది. ఒక్కసారిగా భయపడిన ఆమె.. భర్త వైపు చూసి కేకలు వేసింది. వెంటనే అప్రమత్తమైన టేకర్.. సముద్రంలోకి దిగారు. సొరచేప గమనానికి అడ్డుగా నిలబడ్డారు. కానీ ఆ సొరచేప వీరి వైపు రాకుండా దూరంగా వెళ్లిపోయింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మిచెల్.. భర్తపై ప్రశంసలు కురిపించారు. 'మీరుండగా.. నాకు ఏం భయం. మీరుంటే ఆ ధైర్యమే వేరు. సమస్య నా వద్దకు రావాలంటే ముందు అది మిమ్మల్ని దాటి రావాలి' అంటూ భర్తపై ఉన్న నమ్మకాన్ని కొనియాడారు. తన భర్త బలాన్ని చూసి ఎప్పుడూ ఆశ్యర్యపోతుంటానని చెప్పారు. మిచెల్ మెక్కూల్.. అండర్ టేకర్(58) 2010లో వివాహం చేసుకున్నారు. ఆమె కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో పలు విజయాలు సాధించారు. డివా ఛాంపియన్‌ను రెండు సార్లు గెలిచారు. డబ్ల్యూడబ్ల్యూఈ మహిళల ఛాంపియన్‌గా రెండు సార్లు నిలిచారు. 'నేను ఇప్పటివరకు చూసిన వాళ్లలో అండర్ టేకర్ వంటి మానసిక దృఢత్వాన్ని ఎవ్వరిలో చూడలేదు. ఆటలోకి దిగాక చాలా ప్రభావవంతగా ఆడగలరు. ఏది ఏమైనా నేనున్నాని చెబుతాను. తనతో కలిసి వర్క్ అవుట్ చేస్తాను. మంచి ఆహారాన్ని వండి పెడతాను. అండర్ టేకర్ మానసికంగా, శారీరకంగా బలంగా ఉండటానికి కావాల్సిన పనులు చేస్తాను' అని మిచెల్ మెక్కూల్ చెప్పారు. ఇదీ చదవండి: Nepal Chopper Crash: ఎవరెస్టు సమీపంలో కూలిన హెలికాఫ్టర్.. ఆరుగురు టూరిస్టులు మృతి.. -
క్రిప్టో ఇన్వెస్టర్లకు ఆర్బీఐ రక్షణ
న్యూఢిల్లీ: ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన వివాదాస్పద క్రిప్టో కరెన్సీలు అకస్మాత్తుగా మళ్లీ పాతాళానికి పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ డాలర్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు హరించుకుపోతున్నాయి. 2021లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న క్రిప్టోల మార్కెట్ విలువ కేవలం ఏడాది వ్యవధిలోనే 1 ట్రిలియన్ డాలర్ కన్నా తక్కువకి పడిపోవడం ఈ కరెన్సీల్లో ఉన్న రిస్కులను ప్రపంచానికి మరోసారి తెలియజేసింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రిప్టో ఎక్సే్చంజీగా వ్యవహరించిన ఎఫ్‌టీఎక్స్ కుప్పకూలడంతో దాని సహ–వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్–ఫ్రైడ్ సంపద కేవలం రోజుల వ్యవధిలో ఏకంగా 16 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. భారీ సంపద ఇంత వేగంగా కరిగిపోయిన అతి తక్కువ సందర్భాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఇన్వెస్టర్లను కుదిపేసింది. ప్రధాన స్రవంతిలోకి చేరి అందరి విశ్వసనీయతను పొందేందుకు నానా తంటాలు పడుతున్న క్రిప్టోలపై .. ఇప్పటిదాకా ఉన్న కాస్తో కూస్తో నమ్మకాన్ని కూడా సడలించేసింది. ఆర్బీఐ, ప్రభుత్వ అస్త్రాలతో క్రిప్టో లావాదేవీల కట్టడి.. అయితే, క్రిప్టో ప్రపంచంలో అల్లకల్లోలం రేగుతున్నప్పటికీ దేశీ ఇన్వెస్టర్లు మాత్రం ఈ ప్రభావాల నుండి కొంత సురక్షితంగానే ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రిప్టోలపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఆది నుండి కఠిన వైఖరులు పాటిస్తుండటమే మన ఇన్వెస్టర్లను కాస్త కాపాడుతోందని వారు తెలిపారు. క్రిప్టోలకు గుర్తింపునిచ్చేందుకు ఆర్బీఐ నిరాకరిస్తుండటం, ప్రభుత్వం పన్ను అస్త్రాన్ని ప్రయోగించడం .. వంటి అంశాలు దేశీయంగా డిమాండ్‌ను తగ్గించేందుకు, తద్వారా ఇన్వెస్టర్లను కొంత సురక్షితంగా ఉంచేందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. క్రిప్టోలకు చట్టబద్ధత కల్పించకపోయినప్పటికీ వాటి లావాదేవీలపై వచ్చే లాభాల మీద 30 శాతం పన్ను విధించింది ప్రభుత్వం. అంతేకాకుండా వర్చువల్ డిజిటల్ కరెన్సీలకు చెల్లింపులు రూ. 10,000 దాటితే 1 శాతం టీడీఎస్ కూడా విధించింది. ఇలాంటి చర్యలతో క్రిప్టోల జోలికి వెళ్లకుండా ఇన్వెస్టర్లను కాస్త కట్టడి చేసినట్లయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘ఈ విషయంలో హీరోలు ఎవరు? ఇంకెవరు మన కేంద్ర ప్రభుత్వం, సెబీ, ఆర్బీఐ మొదలైనవే. భారతీయ బ్రోకింగ్ సంస్థలు కూడా క్రిప్టోల్లోకి ప్రవేశించి ఉంటే ఎంత మంది ఎంత డబ్బు పోగొట్టుకుని ఉండేవారో కదా. ప్రభుత్వం, ఆర్బీఐ ఇన్ని చర్యలు తీసుకుంటున్నా .. దాదాపు 3 శాతం మంది భారతీయులు క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేశారు. చివరిగా చెప్పేదేమిటంటే.. ఈ పతనం ఇంకా ముగియలేదు. మార్కెట్ పడిపోయింది కదా అని దయచేసి కొనుగోళ్లకు బైల్దేరవద్దు‘ అంటూ దేశీయంగా అతి పెద్ద ఆప్షన్స్ ప్లాట్‌ఫాం సెన్సిబుల్డాట్కామ్ సీఈవో ఆబిద్ హసన్ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిప్టోలకు గుర్తింపు ఇవ్వకూడదన్న ఆర్బీఐ, ప్రభుత్వ నిర్ణయాలు సరైనవేనని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్చంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) ప్రెసిడెంట్ కమ్లేష్ షా అభిప్రాయపడ్డారు. -
గుజరాత్ లోని పోరుబందర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
-
ఒ' అయితే 'నో' మలేరియా..
లండన్: 'ఒ' బ్లడ్ గ్రూపు వారిని విశ్వదాత అంటారు. వీరు ఈ బ్లడ్ గ్రూప్ కలిగి ఉండటం వీరికంటే ఇతరులకే ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా వీరి గ్రూపు రక్తం అందరికీ ఉపయోగపడుతుంది. ఈ గ్రూపుతో వీరికి కూడా లాభం ఉందని లండన్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. మలేరియా వ్యాధి రాకుండా ఈ బ్లడ్ గ్రూపు రక్షిస్తుందని వీరి పరిశోధనలో వెల్లడైంది. దీని కోసం ఈ గ్రూపు వారిలో జరిగే చర్యల క్రమాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో భాగంగా మానవులు, జంతువులకు సంబంధించిన అనేక రకాల కణాలపై అధ్యయనం చేశారు. ఇందులో రిఫిన్ అనే ప్రొటీన్‌కు సంబంధించిన అనేక అంశాలను కనుగొన్నారు. మలేరియా వ్యాధికి కారణమైన ‘ప్లాస్మోడియం ఫాల్సిపారమ్’ పరాన్న జీవి ఈ రిఫిన్ అనే ప్రొటీన్‌ను విడుదల చేస్తుందని, ఇది రక్త ప్రవాహంపై జిగురులా పట్టి ఉంటుందని అన్నారు. ఇదే మలేరియా వ్యాధికి అసలు కారణమని తెలిపారు. అయితే 'ఒ' గ్రూపు వ్యక్తుల రక్తం ఉపరితలంపై మాత్రం ఇది అంత బలంగా అంటుకుని ఉండలేదని వివరించారు. ఈ కారణంతోనే ఈ గ్రూపు వ్యక్తులకు మలేరియా వ్యాధి సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వెల్లడించారు. ఈ రిఫిన్ ప్రొటీన్ కేవలం మానవుల్లోనే కాకుండా జంతువుల్లోను ఉంటుందని చెప్పారు. అయితే 'ఎ' బ్లడ్ గ్రూపు వ్యక్తులు ఎక్కువగా మలేరియా బారిన పడుతున్నట్టు తమ పరిశోధనలో వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఏటా ప్రపంచంలో 200 మిలియన్ల మంది ఈ వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సీమాంధ్రులకు భద్రత కల్పిస్తాం: సుదర్శనరెడ్డి
హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లోని సీమాంధ్రవాసులకు భద్రత కల్పిస్తామని రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన నిజామాబాద్‌లో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. కేబినెట్ పరంగా సీమాంధ్రులకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. సీమాంధ్రులు ఎటువంటి అభద్రతాభావానికి లోనుకావద్దని ఆయన స్పష్టం చేశారు. నీటి పంపిణిలో కూడా ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదన్నారు. ఓ వ్యక్తి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆందోళన చెందవద్దని ఆయన సీమాంధ్రవాసులకు సూచించారు. అన్ని ప్రాంతాల న్యాయమైన పంపిణీని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి సుదర్శన్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ఉద్యోగులు తమ ప్రాంతాలకు వెళ్లవలసిందే అని కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. వారికి ఎటువంటి అప్షన్లు ఉండవని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైనాయి. దాంతో సచివాలయం నుంచి సీమాంధ్రలోని మారుమూల పల్లె వరకు కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.