డబ్ల్యూడబ్ల్యూఈ అడ్డాలో అండర్ టేకర్ పేరు తెలియని వారుండరు. రింగ్‌లోకి దిగాక ఆయన పిడిగుద్దులకు ఎదురు నిలిచేవారుండరు. ఎంత మంది ఎదురొచ్చినా నిలిచి కొట్లాడే ధైర్యశాలి. అయితే.. వారి ధైర్య సాహసాలు కేవలం రింగ్‌కే పరిమితం కాదని నిరూపించాడు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ అండర్ టేకర్. బీచ్‌లో సొరచేప నుంచి తన భార్యను కాపాడాడు. అవసరం ఎదురైనప్పుడు మనుషులతోనే కాదూ.. క్రూర జంతువులతో కూడా పొట్లాడగల ధీరత్వం రెజ్లర్ సొంతమని చెప్పకనే చెప్పాడు అండర్ టేకర్.
సన్‌డే ఇజ్ ఫన్ డే.. ఎవరైనా కాస్త విశ్రాంతిని కోరుకుంటారు. ఉల్లాసంగా గడపాలనుకుంటారు. అలాగే అండర్ టేకర్ దంపతులు కూడా బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన భార్య మిచెల్ మెక్‌కూల్ సముద్రంలోకి దిగారు. అండర్ టేకర్ బీచ్ ఒడ్డున ఓ పుస్తకం చదువుతున్నారు. ఈ సమయంలో మెచెల్‌కు సమీపంగా ఓ సొరచేప వచ్చింది. ఒక్కసారిగా భయపడిన ఆమె.. భర్త వైపు చూసి కేకలు వేసింది. వెంటనే అప్రమత్తమైన టేకర్.. సముద్రంలోకి దిగారు. సొరచేప గమనానికి అడ్డుగా నిలబడ్డారు. కానీ ఆ సొరచేప వీరి వైపు రాకుండా దూరంగా వెళ్లిపోయింది.
ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మిచెల్.. భర్తపై ప్రశంసలు కురిపించారు. 'మీరుండగా.. నాకు ఏం భయం. మీరుంటే ఆ ధైర్యమే వేరు. సమస్య నా వద్దకు రావాలంటే ముందు అది మిమ్మల్ని దాటి రావాలి' అంటూ భర్తపై ఉన్న నమ్మకాన్ని కొనియాడారు. తన భర్త బలాన్ని చూసి ఎప్పుడూ ఆశ్యర్యపోతుంటానని చెప్పారు.
మిచెల్ మెక్‌కూల్.. అండర్ టేకర్(58) 2010లో వివాహం చేసుకున్నారు. ఆమె కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో పలు విజయాలు సాధించారు. డివా ఛాంపియన్‌ను రెండు సార్లు గెలిచారు. డబ్ల్యూడబ్ల్యూఈ మహిళల ఛాంపియన్‌గా రెండు సార్లు నిలిచారు.
'నేను ఇప్పటివరకు చూసిన వాళ్లలో అండర్ టేకర్ వంటి మానసిక దృఢత్వాన్ని ఎవ్వరిలో చూడలేదు. ఆటలోకి దిగాక చాలా ప్రభావవంతగా ఆడగలరు. ఏది ఏమైనా నేనున్నాని చెబుతాను. తనతో కలిసి వర్క్ అవుట్ చేస్తాను. మంచి ఆహారాన్ని వండి పెడతాను. అండర్ టేకర్ మానసికంగా, శారీరకంగా బలంగా ఉండటానికి కావాల్సిన పనులు చేస్తాను' అని మిచెల్ మెక్‌కూల్ చెప్పారు.
ఇదీ చదవండి: Nepal Chopper Crash: ఎవరెస్టు సమీపంలో కూలిన హెలికాఫ్టర్.. ఆరుగురు టూరిస్టులు మృతి..
Comments
Please login to add a commentAdd a comment