undertaker
-
భార్యను రక్షించడానికి షార్క్‌తో అండర్ టేకర్ మల్లయుద్ధం..!
డబ్ల్యూడబ్ల్యూఈ అడ్డాలో అండర్ టేకర్ పేరు తెలియని వారుండరు. రింగ్‌లోకి దిగాక ఆయన పిడిగుద్దులకు ఎదురు నిలిచేవారుండరు. ఎంత మంది ఎదురొచ్చినా నిలిచి కొట్లాడే ధైర్యశాలి. అయితే.. వారి ధైర్య సాహసాలు కేవలం రింగ్‌కే పరిమితం కాదని నిరూపించాడు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ అండర్ టేకర్. బీచ్‌లో సొరచేప నుంచి తన భార్యను కాపాడాడు. అవసరం ఎదురైనప్పుడు మనుషులతోనే కాదూ.. క్రూర జంతువులతో కూడా పొట్లాడగల ధీరత్వం రెజ్లర్ సొంతమని చెప్పకనే చెప్పాడు అండర్ టేకర్. సన్డే ఇజ్ ఫన్ డే.. ఎవరైనా కాస్త విశ్రాంతిని కోరుకుంటారు. ఉల్లాసంగా గడపాలనుకుంటారు. అలాగే అండర్ టేకర్ దంపతులు కూడా బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన భార్య మిచెల్ మెక్కూల్ సముద్రంలోకి దిగారు. అండర్ టేకర్ బీచ్ ఒడ్డున ఓ పుస్తకం చదువుతున్నారు. ఈ సమయంలో మెచెల్కు సమీపంగా ఓ సొరచేప వచ్చింది. ఒక్కసారిగా భయపడిన ఆమె.. భర్త వైపు చూసి కేకలు వేసింది. వెంటనే అప్రమత్తమైన టేకర్.. సముద్రంలోకి దిగారు. సొరచేప గమనానికి అడ్డుగా నిలబడ్డారు. కానీ ఆ సొరచేప వీరి వైపు రాకుండా దూరంగా వెళ్లిపోయింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మిచెల్.. భర్తపై ప్రశంసలు కురిపించారు. 'మీరుండగా.. నాకు ఏం భయం. మీరుంటే ఆ ధైర్యమే వేరు. సమస్య నా వద్దకు రావాలంటే ముందు అది మిమ్మల్ని దాటి రావాలి' అంటూ భర్తపై ఉన్న నమ్మకాన్ని కొనియాడారు. తన భర్త బలాన్ని చూసి ఎప్పుడూ ఆశ్యర్యపోతుంటానని చెప్పారు. మిచెల్ మెక్కూల్.. అండర్ టేకర్(58) 2010లో వివాహం చేసుకున్నారు. ఆమె కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో పలు విజయాలు సాధించారు. డివా ఛాంపియన్‌ను రెండు సార్లు గెలిచారు. డబ్ల్యూడబ్ల్యూఈ మహిళల ఛాంపియన్‌గా రెండు సార్లు నిలిచారు. 'నేను ఇప్పటివరకు చూసిన వాళ్లలో అండర్ టేకర్ వంటి మానసిక దృఢత్వాన్ని ఎవ్వరిలో చూడలేదు. ఆటలోకి దిగాక చాలా ప్రభావవంతగా ఆడగలరు. ఏది ఏమైనా నేనున్నాని చెబుతాను. తనతో కలిసి వర్క్ అవుట్ చేస్తాను. మంచి ఆహారాన్ని వండి పెడతాను. అండర్ టేకర్ మానసికంగా, శారీరకంగా బలంగా ఉండటానికి కావాల్సిన పనులు చేస్తాను' అని మిచెల్ మెక్కూల్ చెప్పారు. ఇదీ చదవండి: Nepal Chopper Crash: ఎవరెస్టు సమీపంలో కూలిన హెలికాఫ్టర్.. ఆరుగురు టూరిస్టులు మృతి.. -
‘డెడ్‌మ్యాన్’ రిటైర్డ్
మార్క్ విలియమ్ కాలవే.. అంటే ఎవరో తెలియకపోవచ్చు. కానీ అండర్ టేకర్ అంటే తెలియని వాళ్లు అరుదు. కొందరు ముద్దుగా డెడ్ మ్యాన్ అని కూడా పిలుచుకుంటారు. ముఖ్యంగా ‘90ల్లో పుట్టిన తరానికి, అందునా రెజ్లింగ్ ఇష్టంగా చూసేవారికి ఇది చాలా సుపరిచితమైన పేరు. అతనికి అతీత శక్తులుంటాయని, ఏడు జన్మలున్నాయని పిల్లల సర్కిల్లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తుంటాయి. కెరీర్లో బరిలోకి దిగిన మ్యాచుల్లో 70 శాతం విజయాలతో వల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యుడబ్ల్యుఈ) లోనే ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో ఉన్నాడు. చీకట్లో చర్చి గంట శబ్దంతో, నీలి మెరుపులతో, నిప్పురవ్వలతో రింగులోకి వచ్చే తీరుతోనే ప్రత్యర్థిని బెదరగొట్టి అక్కడే సగం గెలిచేస్తాడు టేకర్. బలమైన ప్రత్యర్థి చేతిలో చావుదెబ్బలు తిని పడిపోతే ఇక అతని పని ముగిసినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా లేచి నిలబడతాడు. రెట్టించిన శక్తితో ప్రత్యర్థిపై విరుచుకుపడి మ్యాచ్ గెలుస్తాడు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పేశాడు ఈ లెజెండ్. ఆదివారం సర్వైవర్ సిరీస్‌లో తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఫేర్వెల్ సందర్భంగా డబ్ల్యుడబ్ల్యుఈ సీయీవో విన్సెంట్ మెక్‌మహోన్ రింగు మధ్యలోకి వచ్చి అండర్ టేకర్ రాకను ప్రకటించాడు. ఆ సమయంలో భావోద్వేగానికి గురైన మెక్‌మహోన్ ‘‘30 ఏళ్లుగా అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్న ఒక కెరీర్ ముగిసిపోబోతుంది. ఏదీ శాశ్వతం కాదంటారు చాలామంది. కానీ నా వరకూ అది అబద్ధం. రెజ్లింగ్‌పై టేకర్ వేసిన ముద్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచుంటుంది. ఈ ఆట ముఖచిత్రాన్నే మార్చివేసిన పోరాట యోధుడు అండర్ టేకర్’’ అన్నారు. ఆ వెంటనే తనకు మాత్రమే ప్రత్యేకమైన స్టైల్లో రింగులోకి ఎంటరైన టేకర్ అభిమానుల కేరింతల మధ్య మైకందుకుని ‘‘అండర్ టేకర్‌కు విశ్రాంతినివ్వాల్సిన సమయమొచ్చింది’’ అన్నాడు. తన మాజీ మేనేజర్ బిల్ మూడీ హాలోగ్రామ్ ప్రదర్శించి మూడీపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అండర్ టేకర్ ఇమేజ్ను నిర్మించడంలో మూడీది కీలకపాత్ర. ‘‘అది ఇంకెక్కడా దొరకదు’’ ‘‘మనం ఏదైనా సాధించినప్పుడు కేరింతలు, ఒవేషన్ రూపంలో ప్రేక్షకుల నుంచి తిరిగొచ్చే శక్తి ఇంకెక్కడా దొరకదు. బహుశా ఇందుకే కొందరు (‘ది రాక్’ లాంటివారు) రిటైరైన తర్వాత కూడా రీ ఎంట్రీ ఇస్తుంటారు. నా వరకు రెజ్లింగ్ అనేది అత్యుత్తమ క్రీడ. ప్రేక్షకులు ప్రత్యక్షంగా సినిమా చూస్తున్న అనుభూతికి లోనవుతారిక్కడ. ఆటగాళ్లలో ఉండే ఎమోషన్ కూడా చాలా ఎక్కువే. అదే సమయంలో కొన్ని హద్దులు దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. ఎంతో ఒత్తిడితో కూడుకున్న ఈ ఆటలో మా ప్రతిభకు తగినంత గుర్తింపు లభిస్తుందా? అని అప్పుడప్పుడూ ఆలోచిస్తుంటాను. నిజంగా ఈ 30 ఏళ్లు చాలా వేగంగా గడిచిపోయాయి.’’ - అండర్ టేకర్ (డబ్ల్యుడబ్ల్యుఈ రూపొందించిన డాక్యుమెంటరీలో..) ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో స్పందించిన సహచర రెజ్లర్లు.. ‘‘తన జీవితంలో 30 ఏళ్లు డబ్ల్యుడబ్ల్యుఈ కి అంకితం చేసిన ఓ అత్యుత్తమ ఆటగాడికి వీడ్కోలు చెప్పాల్సిన సమయమొచ్చింది. తోటి ఆటగాడిగా రింగులో నాతో కొన్ని క్షణాలు పంచుకున్నందుకు థాంక్యూ టేకర్!’’ - జాన్ సీనా ‘‘30 ఏళ్ల క్రితం ఈ రోజున మా అందరిలాగే అరంగేట్రం చేశాడతను. నా కెరీర్ ప్రారంభంలో ఓ సాయంత్రం డ్రెసింగ్ రూములోకొచ్చి నన్ను ప్రోత్సహించేలా మాట్లాడిన మాటలు నేనెప్పటికీ మర్చిపోలేను. నీతో కలిసి రింగ్ పంచుకోవడం ఒక గౌరవం.’’ - ది రాక్ ‘‘మనిద్దరం ప్రతీ ఫార్మట్‌లో తలపడ్డాం. కొన్ని ప్రత్యేకానుభూతుల్ని సృష్టించుకున్నాం. రింగులో ఉన్నప్పుడు నువ్వొచ్చేముందు వినిపించే ఆ బెల్ శబ్దం నన్ను భయపెట్టేది. అయినా చివరిసారిగా దాన్ని వినేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.’’ - షాన్ మైఖేల్స్ -
డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్
మార్క్ క్యాలవే అనే పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. అదే అండర్ టేకర్ అంటే తెలియని రెజ్లింగ్ అభిమాని ఉండరు. ముఖ్యంగా డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులకు ద డెడ్ మ్యాన్ (అండర్ టేకర్) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా రెజ్లింగ్ అభిమానులను తన ప్రదర్శనతో అలరిస్తున్న ఈ వెటరన్ రెజ్లర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. రెజ్లింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. డబ్ల్యూడబ్ల్యూఈ విడుదలచేసిన అండర్ టేకర్ బయోపిక్ ‘ద లాస్ట్ రైడ్’ డ్యాక్యూమెంటరీ చివరి ఎపిసోడ్లో అండర్ టేకర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘ఇక సాధించాల్సింది ఏమీ లేదు. మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టాలని అనుకోవడం లేదు. ఇది చాలా మంచి సమయం. ఇలాంటిది మళ్లీ రాదు. నా కెరీర్‌కు ముగింపు పలకడానికి ఏదైనా మంచి సమయం ఉందంటే.. అది ఇదే’ అని ఆ డ్యాక్యుమెంటరీలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ట్విటర్లో కూడా తాజాగా అధికారికంగా వెల్లడించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ చాంపియన్ షిప్ బెల్ట్ పట్టుకొని ఉన్న రోహిత్ శర్మ ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ థ్యాంక్యూ అండర్ టేకర్ అని ట్వీట్ చేసింది. 52 ఏళ్ల అండర్ టేకర్ 1987లో వరల్డ్ క్లాస్ ఛాంపియన్షిప్ రెజ్లింగ్‌తో కెరీర్‌ను ఆరంభించారు. 1990ల్లో టెడ్ డిబియాస్ మిలియన్ డాలర్ టీంలో చివరి సభ్యుడిగా డబ్ల్యూడబ్ల్యూఈలో ఆయన అడుగుపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఈయనకు క్రేజ్ ఉన్నప్పటికీ జాన్ సీనా, ద రాక్ మాదిరి సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. అండర్టేకర్ తన చివరి మ్యాచ్‌లో ఏజే స్టైల్స్‌తో తలపడ్డారు. కాగా, తనతో జరిగిన మ్యాచ్చే అండర్టేకర్కు చివరిదైతే తనకెంతో గర్వంగా ఉంటుందని ఏజే స్టైల్స్ పేర్కొన్నారు. #ThankYou pic.twitter.com/6D1th4wZlA — Undertaker (@undertaker) June 23, 2020 You can never appreciate how long the road was until you’ve driven to the end. #TheLastRide @WWENetwork pic.twitter.com/JW3roilt9a — Undertaker (@undertaker) June 21, 2020 -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ రెజ్లర్
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్కు(డబ్ల్యూడబ్ల్యూఈ) ప్రఖ్యాత రెజ్లర్ ది అండర్టేకర్ రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు 30 ఏళ్లుగా రెజ్లింగ్‌లో ఫీల్డ్‌లో ఉన్న అండర్టేకర్.. ది లాస్ట్ రైడ్ డాక్యూ సిరీస్ చివరి ఎపిసోడ్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నాకు మరోసారి రెజ్లింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టాలనే కోరిక లేదు. నేను గెలవడానికి ఏమి లేదు. నేను సాధించేది కూడా ఏమి లేదు. ప్రస్తుతం ఆట మారింది. ఇది కొత్తవారు రావడానికి సరైన సమయం. ఈ డాక్యూమెంటరీ నాకు చాలా సాయం చేసిందని భావిస్తున్నాను. ఇది ఒక రకంగా నా కళ్లు తెరిపించింద’ని పేర్కొన్నారు.(చదవండి : ‘ద్రవిడ్ కెప్టెన్సీకి క్రెడిట్ దక్కలేదు’) ఇదే విషయాన్ని అండర్టేకర్ ట్విటర్ ద్వారా కూడా వెల్లడించారు. రెజ్లింగ్‌లో తన ప్రయాణం ముగిసిందని పేర్కొన్నారు. ఇక మిగిలిన జీవితంలో తన శ్రమకు దక్కిన ఫలాలను అస్వాదించనున్నట్టు తెలిపారు. మరోవైపు అండర్టేకర్ రిటైర్మెంట్పై డబ్ల్యూడబ్ల్యూఈ నెట్వర్క్ సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు చేసింది. అండర్టేకర్కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. కాగా, అండర్టేకర్ తన చివరి మ్యాచ్‌లో ఏజే స్టైల్స్‌తో తలపడ్డారు. వాస్తవానికి అండర్టేకర్ అసలు పేరు మార్క్ కాలవే.(చదవండి : దిమిత్రోవ్‌కు కరోనా.. జొకోవిచ్‌లో ఆందోళన) థాంక్యూ టేకర్.. అండర్టేకర్ రిటైర్మెంట్పై ముంబై ఇండియన్స్ జట్టు స్పందించింది. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ హేవీ వెయిట్ చాంపియన్‌షిప్ బెల్ట్‌ను పట్టుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 30 అద్భుతమైన సంవత్సరాలు పేర్కొన్న ముంబై ఇండియన్స్.. థాంక్యూ టేకర్ అని పేర్కొంది. -
కుస్తీ సాధన చేస్తూ పసివాడి హత్య
జెర్సీషోర్: కుస్తీ సాధన చేస్తూ తన గర్ల్ ఫ్రెండ్ 18 నెలల కొడుకును నేలకేసి కొట్టి చంపేశాడో ప్రబుద్ధుడు. ఆమె ఉద్యోగానికి వెళ్తూ.. తన కొడుకును అతడి దగ్గర వదిలి వెళ్లింది. ఆ సమయంలో ఈ ఘోరం జరిగింది. రెజ్లింగ్ వృత్తినే పరిహాసం చేసిన ఈ ఘటన పై ప్రపంచ రెజ్లింగ్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రాండన్ హాఫ్‌మెన్ అనే 20 ఏళ్ల రెజ్లర్ కుస్తీలో ప్రముఖమైన 'ది లాస్ట్ రైడ్ (ప్రత్యర్థి ఎత్తి భుజాలపై ఎత్తుకొని.. గిరాగిరా తిప్పి బలంగా నేలకేసి కొట్టే) అనే పట్టు సాధన కోసం 18 నెలల పసిబాలుడ్ని ఎంచుకున్నాడు. మంచంపై ఉన్నపిల్లవాణ్నిఅతి దారుణంగా నేలకేసి కొట్టాడు. దీంతో ఆ పసివాడు మెడనరాలు విరిగి, తలకు తీవ్రంగా గాయాలు కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల సమాచారం ప్రకారం సంఘటనపై హాఫ్మన్ వాస్తవాలను చెప్పలేదు. పైకి ఎగరేసి పట్టుకోలేకపోయానని మొదట చెప్పిన నిందితుడు, ఆ తర్వాత విచారణలో అసలు విషయాన్ని అంగీకరించాడు. గతంలో కూడా అతడు ఇలాంటి ప్రయత్నం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. హాఫ్మన్పై కేసు నమోదుచేసిన పోలీసులు కోర్టు తరలించారు. కోర్టు అతనికి సుమారు కోటి రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.దీనిపై తీవ్రం ఆగ్రహం వ్యక్తంచేసిన ప్రపంచ కుస్తీసంఘం కుస్తీకే మాయని మచ్చను తీసుకొచ్చిన హాఫ్ మన్ ను క్షమించేది లేదని తేల్చి చెప్పింది. బాలుడి తల్లికి సంతాపం తెలిపింది.