సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తాం: కెటిఆర్
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల భయాందోళనలను తొలగించడానికి హైదరాబాద్‌లో సద్భావనా యాత్రలు నిర్వహిస్తామని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామన్నారు. పులిచింతల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని చెప్పారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మానసికస్థితి బాగోలేదని కేటీఆర్ అన్నారు. అందుకే ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు.