take care
-
మనవరాలి సంరక్షణ కోసం.. గంటకు రూ. 1600లు డిమాండ్ చేసిన అమ్మమ్మ!..
ప్రస్తుతం ఆలుమగలు ఉరుకులు పరుగులు జీవితంతో పిల్లల ఆలనపాలన చూసుకోలేని స్థితిలో లేరు. అందులోనూ భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయితే పిల్లల బాగోగులు చూసుకోవడం అస్సలు కుదరదు. కాస్త స్తోమత ఉంటే డేకేర్ లేదంటే అమ్మమ్మ, నాయనమ్మల వద్ద ఉంచాల్సిందే. కానీ ఇక్కడొక అమ్మమ్మ తన మనవరాలిని చూసుకునేందుకు గంటకు రూ. 1600లు ఇవ్వాల్సిందేనని కూతురికి తెగేసి చెప్పింది. దీంతో కూతురు ఒక్కసారిగా షాక్ గురయ్యింది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకిలా ఆమె డిమాండ్ చేసిందంటే.. అసలేం జరిగిందంటే..ఓ వృద్ధ మహిళ తన సొంత మనవరాలిని సంరక్షణ కోసం, గంటకు రూ. 1600 ఛార్జ్ చేస్తానని కరాఖండీగా చెప్పింది కూతురికి. అంతేగాదు ఆ చిన్నారికి సంబంధించిన కొన్ని లగ్జరీ వస్తువులను కూడా డిమాండ్ చేసింది ఆ వృద్ధురాలు. ఈ విచిత్ర ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. కూతురు..."తన తల్లి వృద్ధురాలని, పైగా ఇంట్లో ఖాళీగానే ఉంది. కాబట్టి తాను తన కూతురిని చూసుకోమని అడిగాను. ఇది ఏమైనా అడగకూడని విషయమా!. తాను, తన భర్త ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నందువల్లే అడుతున్నా" అని కూతురు తల్లిని ప్రాధేయపడుతోంది. తన తల్లి వయసు 64 ఏళ్లు అని, ప్రస్తుతం ఆమె ఏ ఉద్యోగం చేయడం లేదు. అందువల్ల ఆమెకు చాలా సమయం ఉంటుంది. కాబట్టి నా కుమార్తెను చూసుకోమని అడిగాను. కానీ ఆమె గంటకు సుమారు 16 పౌండ్ల ఛార్జీ ఇవ్వాలని చెబుతోంది. ఏం చేయాలో తెలియడం లేదని సోషల్ మీడియాలో వాపోయింది ఆ వృద్ధురాలి కూతురు. తన తల్లి ఆలస్య రుసుమును కూడా వసూలు చేస్తానని కరాఖండీగా చెప్పనట్లు తెలిపింది. అంతేగాదు కారులో ప్రత్యేక సీటు, స్టోలర్, బాటిల్ ఇతర వస్తువులు కూడా కావలని డిమాండ్ చేసిందంటూ గోడు వెల్లబోసుకుంది కూతురు. ఎందుకు ఆ వస్తువులన్నీ అడిగిందంటే.. తన తల్లి వస్తువులను శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించను కూడా ఉపయోగించదని ఆవేదనగా చెబుతోంది. ఇంత మొత్తం చెల్లించాలంటే తాను అప్పులుపాలు కాక తప్పదని కూతురు ఒకటే గోల చేస్తోంది. కానీ సదరు వృద్ధురాలు తన డిమాండ్లను అంగీకరించకపోతే చూడనని నిర్మోహమాటం చెప్పేసింది. ఇక ఆమె ఒప్పుకోకపోతే కూతుర్ని డేకేర్‌లో పెడతానని చెబుతోంది. తన కుటంబంలో అందరూ నైన్ టు ఫైవ్ జాబే చేస్తారని, అందువల్లే తాను వాళ్ల అమ్మను కోరినట్లు పేర్కొంది. ఈ విషయం ప్రస్తుతం బ్రిటన్ అంతటా తెగ వైరల్ అవుతోంది. నిజానికి చాలామంది వృద్ధులు లేదా ఇంట్లోని పెద్దవాళ్ల పట్ల ఇలాంటి ధోరణితోనే ఉంటారు. ఇది సరైనది కాదు. వృద్ధులు ఖాళీగా పనిపాట లేకుండా ఉంటారని అలుసుగా చూడకూడదు. జీవితంలో పడరాని పాట్లు కష్టాలు పడి మనల్ని పెంచినవారు. వారు జీవితంలో ఎన్నో వేదనలను గెలుపోటములు చూసి.. చూసి.. అలసిపోయిన వాళ్లు. వాళ్లకంటూ కాస్త ఏకాంతం కావాలని కోరుకుంటారు. ముందుగా వారి ఓపెనియన్ అడగాలి. వారి మనసెరిగి మసులుకుంటే చూసేదేమో ఆమె!. ఏమో ఆమె మనసులో ఏమూలనో ఏదో అభద్రతా భావం ఉంటేనే కథ ఇలా మాట్లాడతారు. ఒక్కసారి ఇలా ఆలోచించి వారిని అర్థం చేసుకునే యత్నం చేయండి. కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఈ విషయం పట్ల నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందించారు. పిల్లలను చూసుకునే సామర్థ్యం లేప్పుడూ పిల్లల్ని కనాలనే ఆలోచన తీసుకోకుండా ఉండాల్సింది. లేదా గర్భధారణ సమయంలోనే తల్లితో మాట్లాడి ఉండాల్సింది. అయినా ఆమె ఇప్పటి వరకు మిమ్మల్ని సంరక్షించింది. ఇక మీ కూతుర్ని చూసుకోవాల్సింది మీ బాధ్యతే అని ఆమెకు చివాట్లు పెడుతూ పోస్ట్‌లు పెట్టారు. (చదవండి: ఏనుగు చెవులు లాంటి అరుదైన ఆక్టోపస్! విస్తుపోయిన శాస్త్రవేత్తలు -
మణిపూర్ అమ్మాయిల బాధ్యత నాదే.. మంత్రి మంచి మనసు
బెంగళూరు: మణిపూర్ శరణార్థుల విషయంలో కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ మంచి మనసు చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 29 మంది మణిపూర్ అమ్మాయిల బాధ్యతలను తీసుకుంటున్నట్లు ప్రకటించారాయాన. మణిపూర్ అల్లర్ల కారణంగా.. మణిపూర్ నుంచి చాలామంది ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లారు. ఆ రాష్ట్రం నుంచి కొందరు కర్ణాటక చామరాజ్‌పేట సెయింట్ థెరెస్సా విద్యాసంస్థల్లో ఆశ్రయం పొందుతున్నారు. వాళ్లలో 29 మంది చదువుకునే వయసున్న అమ్మాయిలు ఉన్నారు. ఆగష్టు 1వ తేదీన జమీర్ అహ్మద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లారు. ఆ అమ్మాయిలతో మాటామంతీ కలిపిన ఆయన వాళ్ల పరిస్థితికి చలించిపోయారు. తక్షణ సాయంగా రూ.2 లక్షలను ప్రకటించారాయన. ‘‘వాళ్ల చదువులు పూర్తి కావాలంటే ఏడేళ్లు పూర్తి కావొచ్చు. ఈ ఏడేళ్ల కాలంలో వాళ్లకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా. వాళ్లు ఇక్కడ ఉన్నంత కాలం సురక్షితంగా ఉండొచ్చు’’ అని ప్రకటించారాయన. జమీర్ అహ్మద్ ‘నేషనల్ ట్రావెల్స్’ భాగస్వామ్య యాజమాని. చామరాజ్‌పేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారాయన. అందులో మూడుసార్లు జేడీఎస్ నుంచి.. రెండుసార్లు కాంగ్రెస్ తరపున నెగ్గారు. ప్రస్తుతం హౌజింగ్ & మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారాయన. -
పిల్లల్ని బాగా చూసుకో..
కుత్బుల్లాపూర్: నాకు బతకాలని లేదు.. నా భర్త మంచోడు.. ఇంకో పెళ్లి చేసుకో..పిల్లలని బాగా చూసుకో.. అంటూ ఓ మహిళ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్‌బరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది . పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరిజిల్లా, మందపల్లి గ్రామానికి చెందిన చుక్క శ్రీను, దేవి (32) దంపతులు నగరానికి వలస వచ్చి కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్ ఫేస్–2 సంజీవయ్యనగర్‌లో ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీను ఆటోడ్రైవర్‌గా పని చేస్తుండగా, దేవి షాపింగ్ మాల్లో సేల్స్ ఉమెన్‌గా పని చేసేది. మంగళవారం షాపింగ్ మాల్లో పనికి వెళ్లిన దేవి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచి్చంది. ఇంట్లో ఉన్న భర్తతో తనకు కడుపు నొప్పి వస్తోందని చెప్పడంతో అతను మందులు తెచ్చి ఇచ్చి ఆటో తీసుకుని బయటికి వెళ్లాడు. సాయంత్రం పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా దేవి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. స్థానికుల సాయంతో కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. ఆమె మృతదేహం పక్కనే సూసైడ్ లెటర్ కనిపించింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పేట్‌బïÙరాబాద్ ఎస్ఐ రామకృష్ణ పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ప్రేమ పేరుతో మైనర్ బాలికకు వంచన! ) -
అనాథలకు ప్రభుత్వమే తల్లీతండ్రీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనాథలకు తల్లి, తండ్రిగా ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. అనాథల సంరక్షణ కోసం కొత్త విధానాన్ని తీసుకొస్తామని పేర్కొంది. ఈ మేరకు విధివిధానాలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అనాధల సంరక్షణ నిమిత్తం ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మొదటిసారి సమావేశమైంది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కె.తారక రామారావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. అనాథల సంక్షేమాన్ని ప్రభుత్వం మానవీయ కోణంలో చూస్తోందని, ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధం ఉందని, ఈ నేపథ్యంలో సబ్ కమిటీ ద్వారా ప్రతిపాదించే పాలసీ దేశం మొత్తం గర్వించే విధంగా ఉండాలని కమిటీ అభిప్రాయపడింది. ఇతర రాష్టాలన్నీ అనుసరించే విధంగా సూచనలు రూపొందించాల్సిన ఆవశ్యకతపై కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక రంగాల్లో దేశానికి ఆదర్శవంతంగా ఉందని, అనాథల కోసం రూపొందించే విధానం కూడా వీటన్నింటినీ మించి ఉంటుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబంగా స్థిరపడే వరకు బాధ్యత అనాథలుగా ప్రభుత్వ సంరక్షణలోకి వచ్చిన పిల్లలు ఎదిగి తల్లిదండ్రులుగా మారి, కుటుంబంగా స్థిరపడేవరకు ప్రభుత్వమే వారికి తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకునేలా కొత్త విధానం ప్రతిపాదిస్తామని సభ్యులు చెప్పారు. పాత చట్టాలకు మార్పులు, సవరణలు కాకుండా సంపూర్ణ, సమగ్ర కొత్త విధానం , కొత్త చట్టం ఉండే విధంగా ఈ సబ్ కమిటీ కసరత్తు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు విహార్‌లు, హోమ్‌లు, ఆశ్రమాలను పటిష్టంగా తయారు చేసేలా, ప్రైవేట్ ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో గొప్పగా నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాలను ప్రోత్సహించేలా ఈ కమిటీ సూచనలు సమర్పిస్తుందని చెప్పారు. -
వామ్మో.. దొంగలు
► వేసవిలో భయాందోళనలో ప్రజలు ► గతేడాది ఉమ్మడి జిల్లాలో 86 చోరీలు ► రాష్ట్రంలోకి బీదర్, గుల్బ్బర్గా ముఠాలు ► అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు ఆదిలాబాద్: ఈ ఏడాది వేసవి ప్రారంభం కావడంతో ఆదిలాబాద్ పట్టణంలో దొంగల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. ఆయా కాలనీల్లో కొంత మంది విహారయాత్రలు, దూర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లు, శుభకార్యాలకు సొంత ఊళ్లకు వెళ్తున్నారు. రోజుల తరబడి ఇంటికితాళం వేసి ఉండడంతో దొంగలకు ఇదే అనువుగా భావిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో రెక్కీ నిర్వహించి రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని నాలుగు బట్టల దుకాణాల్లో ఏకకాలంలో దొంగతనం జరిగింది. ఇందులో రూ.50 వేల నగదు, రూ.20వేల విలువగల దుస్తులు చోరీకి గురయ్యాయి. ఉమ్మడి జిల్లాలో గతేడాది మార్చి, ఏప్రిల్, మేలలో 86 దొంగతనాలు జరిగాయి. రూ.28 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఇందులో రూ.13లక్షలు రికవరీ అయ్యాయి. ఏడాది మొత్తంలో 300 దొంగతనాలు జరగగా రూ.3కోట్ల 26లక్షల 15వేల 809 నగదు, ఆస్తులు దొంగల పాలు కాగా.. పోలీసులు రూ.2కోట్లు రికవరీ చేశారు. బీదర్, గుల్బర్గా ముఠాలు.. రాష్ట్రంలో బీదర్, గుల్బర్గాలకు చెందిన దొంగల ముఠాలు సంచరిస్తుండడంతో జిల్లాలో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో మహారాష్ట్ర, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారే దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు బీదర్, గుల్బర్గా ముఠాలు వస్తున్నాయని తెలియడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మూడేళ్ల కిందట బాసర, మంచిర్యాలలో దోపిడీ దొంగలు ఇంట్లో పడుకుని ఉన్న వారిని చంపి చోరీకి పాల్పడ్డారు. వీరిని పార్టీ ముఠాలు అంటారు. మనుషులను చంపి దొంగతనాలకు పాల్పడడం వీరి ప్రత్యేకత. ఇప్పుడు వస్తున్న ముఠాలు చిన్నపిల్లలు ఏడ్చినట్లు అరుస్తూ.. దొంగతనాలకు పాల్పడుతారు. ఎవరో ఏడుస్తున్నారంటూ బయటకు వస్తే వారిపై దాడులు చేసి దోపిడీకి పాల్పడుతారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వారిని నమ్మకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇప్పటికే ఈ ముఠాలకు సంబంధించి వాట్సాప్‌లో ప్రచారం జరుగుతోంది. చిన్న పిల్లల అరుపులు వినిపిస్తే తలుపులు తెరవకూడదంటూ ఎస్పీ ఎం.శ్రీనివాస్ వాట్సాప్ మెసేజ్ ద్వారా జిల్లా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అప్రమత్తత అవసరం.. ప్రజల అప్రమత్తతోనే దొంగతనాలను నివారించవచ్చు. వేసవి సెలవులను సరదాగా గడిపేందుకు విహారయాత్రలు, శుభకార్యాలకు సొంత గ్రామాలకు వెళ్తుంటారు. ఇలాంటి సమయంలో ఇంటికి తాళం వేయడమే కాకుండా పక్కింటి వారికి చెప్పి వెళ్లాలి. పోలీసులకు కూడా సమాచారం అందించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు పక్కింటి వారికి ఫోన్లో అందుబాటులో ఉండాలి. ఇంట్లో బంగారు నగలు, విలువైన వస్తువులు, డబ్బులు ఉంచకూడదు. వేసవి కావడంతో ఇంట్లోని కూలర్ల చప్పుడుకు పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. దీంతో దొంగలు వారి పని సులువుగా చేసుకుపోయే అవకాశం ఉంటుంది. రాత్రి మెలకువ వచ్చినప్పుడు కాసేపు ఇంట్లోంచి బయటకు వచ్చి చూడాలి. అనుమానంగా శబ్దాలు వినిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. గతేడాది వేసవిలో జరిగిన దొంగతనాలు.. మార్చి 25న జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు షేర్ల స్వామి ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. రూ.లక్ష నగదు, 13 తులాల బంగారం, 300 గ్రాముల వెండి ఎత్తుకెళ్లారు. ఏప్రిల్ 20న ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే క్వార్టర్స్‌లోని రైల్వే ఉద్యోగి రఘునాథ్ ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. రూ.80 వేల నగదుతో పాటు, మూడు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఏప్రిల్ 16న రామకృష్ణాపూర్‌లోని శివాజీనగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు సత్యనారాయణ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు నాలుగు తులాల బంగారం, రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. ఏప్రిల్ 2న మంచిర్యాల హైటెక్‌సిటీలో నారాయణ ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు ఐదు తులాల బంగారం, రూ.50వేల నగదు ఎత్తుకెళ్లారు. నిఘా పెంచాం జిల్లాలో పోలీసు నిఘా పెంచాం. వేసవిలో ప్రజలు విహారయాత్రలు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందించాలి. అనుమానిత వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదు. కాలనీలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై నిఘా ఉంచుతాం. పట్టణంలో బీట్లు పెంచి నిరంతరం గస్తీ నిర్వహిస్తాం. – ఎం. శ్రీనివాస్, జిల్లా ఎస్పీ -
టూరు పోదామా గురూ..!
పరీక్షలు అయిపోతున్నాయి. సెలవులు వచ్చేస్తున్నాయి. మరో విద్యా సంవత్సరం మొదలయ్యేలోపు అలా ఓ టూరుకు వెళ్లొచ్చేస్తే పోలా!! ఇదే ఇపుడు చాలామంది ఆలోచన. నిజమే! వేసవికాలం కనుక చల్లటి ప్రదేశాలో, సముద్ర తీర ప్రాంతాలో అయితే బెటర్. అయితే ఒక్క మాట. దేశంలో చల్లటి ప్రాంతాలంటే దక్షిణాదిన ఊటీ, మున్నార్, కూర్గ్, కొడెకైనాల్, మైసూర్ వంటివి ఎంచుకోవచ్చు. ఇక హిమాలయ ప్రాంతాలైతే కశ్మీర్ నుంచి సిమ్లా, మనాలి, డార్జిలింగ్, నైనిటాల్, షిల్లాంగ్ వరకూ చాలా ప్రాంతాలున్నాయి. కాకపోతే ఒక్క మాట. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ ప్రదేశాలకు వెళ్లే ఖర్చుతో విదేశాలను కూడా చుట్టేసి రావొచ్చు. అందుబాటులోకి వచ్చిన లోకాస్ట్ విమాన సేవలు, హోటళ్లు, ట్రావెల్ కంపెనీల మధ్య పోటీ కారణంగా మధ్య తరగతి బడ్జెట్లోనే విదేశీయాత్ర చేసే అవకాశం లభిస్తోందిప్పుడు. మరి ఆ ప్లానింగ్ ఎలా చేయాలి? ఖర్చు తగ్గించుకునేందుకు ఉన్న మార్గాలేంటి. టూర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వీటన్నిటి సమాహారమే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... ఎంచుకోవటం ఎలా? మొట్టమొదటి అంశం ఎక్కడికెళ్లాలి? అనేదే. దీనికి ప్రధానంగా చూడాల్సిందల్లా మనం ఏ సమయంలో వెళుతున్నాం? మన బడ్జెట్ ఎంత? మనకు అందుబాటులో ఉండే సమయమెంత? ఈ మూడింటి ఆధారంగా ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నవారు ‘ట్రిప్ అడ్వయిజర్’ వంటి వెబ్సైట్లలో వెదకొచ్చు. ఇంటర్నెట్ అందుబాటులో లేకున్నా... సెర్చ్ చేసే పరిజ్ఞానం లేకున్నా అలాంటి వారికోసం ఆన్లైన్ ట్రావెల్ సంస్థలైన ‘మేక్ మైట్రిప్’ వంటివి ఆఫ్‌లైన్ ఆఫీసుల్ని కూడా నిర్వహిస్తున్నాయి. వారి దగ్గరికెళ్లి మన బడ్జెట్, సమయం తదితర వివరాలన్నీ చెబితే వారే తగు సూచనలిస్తారు. ఇక ట్రిప్ అడ్వయిజర్ వంటి సైట్లలో ఏ టూర్‌కు వెళ్లాలనేది చూసుకున్నాక... ఆ టూర్‌పై, అక్కడుండే సౌకర్యాలపై అప్పటిదాకా అక్కడికి వెళ్లి వచ్చినవారు చేసే వ్యాఖ్యలు (కామెంట్స్) చూస్తే తేలిగ్గా టూర్‌పై ఒక నిర్ణయం తీసుకోగలుగుతాం. విమానం టికెట్లు, హోటల్స్... ఎక్కడికి వెళ్లాలనేది ఎంచుకున్నాక మొదట చూడాల్సింది విమానం టికెట్లనే. నిజానికి విమానం టికెట్లు చాలా సందర్భాల్లో ఆఫర్లలో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఆఫర్లు లేనప్పుడైతే ఎంత ముందుగా బుక్ చేసుకుంటే అంత తక్కువ ధరకు లభిస్తాయన్నది కాదనలేని నిజం. అందుకని టూర్‌ను ప్లాన్ చేసుకునేటపుడు ఎంత ముందుగా చేసుకుంటే అంత పొదుపు చేసుకోవచ్చని చెప్పాలి. విమాన టికెట్ల కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేసేటపుడు గూగుల్ ఫ్లైట్స్తో పాటు ఇక్సిగో, గో ఐబిబో, మేక్ మైట్రిప్, యాత్రా, క్లియర్ ట్రిప్, ట్రావెల్గురు వంటి పలు వెబ్‌సైట్లున్నాయి. వీటిద్వారా సెర్చ్ చేసేటపుడు అక్కడుండే ఆప్షన్ల ఆధారంగా అతితక్కువ ధరలు ఉండే రోజుల్లో టికెట్లు కొనుక్కునే వెసులుబాటు కూడా ఉంటుంది. వీటిల్లో విమాన టికెట్లతో పాటు హోటల్ గదులూ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇవి విడివిడిగా బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే విమాన టికెట్లు, హోటల్ గదులు రెండూ కలిపి ఆఫర్లలో లభిస్తాయి. ఈ రెండూ కాదనుకుంటే ఏకంగా ట్రావెల్ ప్యాకేజీల గురించి కూడా ఈ వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తమ్మీద మూడింటి గురించీ తెలుసుకుని ఏది మనకు అందుబాటులో ఉందో, ఏదైతే తక్కువ ధరకు లభిస్తోందో, ఏదైతే మనకు అవసరమనిపిస్తుందో అదే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. హోటల్ గదుల్ని బుక్ చేసేటపుడు సదరు హోటల్ గురించి, అక్కడి సిబ్బంది సర్వీసు గురించి, అది ఉండే ప్రాంతం మిగతా ప్రాంతాలకు దగ్గరగా ఉంటుందో... దూరంగా ఉంటుందో... ఇవన్నీ తెలుసుకోవటానికి ఆయా హోటల్స్‌కు సంబంధించి ట్రిప్ అడ్వయిజర్ వంటి వెబ్సైట్లలో వినియోగదారులు రాసే కామెంట్లు, సమీక్షలు ఎంతో ఉపకరిస్తాయి. అవన్నీ తెలుసుకున్నాకే బుక్ చేసుకోవటం చాలా మంచిది. ప్యాకేజీల విషయంలో జాగ్రత్త! ఒకవేళ ఏకంగా ప్యాకేజీలనే తీసుకుంటే... మనం చెల్లించే డబ్బుల్లో ఆ ప్యాకేజీలో ఏమేం వస్తాయి? ఏమేం విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది? అనే విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా ప్యాకేజీల్లో అక్కడి టూర్ ప్రాంతాలు కొన్నే కలిపి ఉంటాయి. మిగిలిన ప్రాంతాలు సందర్శించాలంటే వేరే చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు హోటళ్లలో భోజనం వంటి సౌకర్యాలు కూడా ప్యాకేజీలో కలిపి ఉన్నాయో, లేదో చూసుకోవాలి. కేవలం విమాన టికెట్లు, హోటల్ గదులు, ఒకటి రెండ్రోజుల లోకల్ సైట్ సీయింగ్ను ప్యాకేజీల్లో పెట్టి అతితక్కువకు విక్రయించే సంస్థలు లేకపోలేదు. అలాంటి ప్యాకేజీల్ని ఎంచుకునేటపుడు మనం అదనంగా ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందనేదీ ముందే అంచనా వేసుకోవాలి. ఇక విమాన ప్రయాణం చేసేటపుడు ఎంత బ్యాగేజీకి అనుమతిస్తున్నారు? అనేది ముందే తెలుసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. తిరిగి వచ్చేటపుడు అక్కడి షాపింగ్ సామగ్రినీ కలుపుకుని మొత్తం బ్యాగేజీ అంచనా వేసుకోవాలి. బీమా తప్పనిసరి... విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రయాణ బీమా తీసుకోవడం మర్చిపోవద్దు. ఎయిర్ టికెట్లు కొన్నప్పుడు ఇచ్చే ఇన్సూరెన్స్ చాలా మటుకు ఆ విమాన ప్రయాణానికి మాత్రమే పరిమితమవుతుంది. అలా కాకుండా విదేశానికి వెళ్ళి తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చే వరకు వైద్య బీమాతో పాటు ఇతర అన్ని అంశాలకు రక్షణ కల్పించే విధంగా తప్పనిసరిగా బీమా పాలసీ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎంచుకున్న టూర్ ప్యాకేజీ ఆధారంగా విమానయాన సంస్థ పూర్తి బీమా రక్షణ కల్పిస్తే ఓకే. లేకపోతే తీసుకోవడం మర్చిపోవద్దు. వాతావరణం మారినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తడం అత్యంత సహజం. విదేశాల్లో అనారోగ్యానికి గురైతే.. అయ్యే వైద్య చికిత్సా వ్యయం సామాన్యులకు అందుబాటులో ఉండదు. అలాగే ఏదైనా దొంగతనం జరిగి నగదు, పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే ఈ బీమా అక్కరకు వస్తుంది. ఈ ట్రావెల్ బీమా ప్రీమియంలు చాలా స్వల్పంగా ఉంటాయి. ప్రీమియం అనేది మీరు పర్యటించే రోజులను బట్టి ఉంటుంది. సాధారణంగా ట్రావెల్ బీమా ప్రీమియంలు రూ. 300 నుంచి ఆరంభమవుతున్నాయి. ఇదీ... అంతర్జాతీయ ప్రయాణాల కథ. ఢిల్లీకన్నా తక్కువకే కౌలాలంపూర్.. కేరళలో ఎనిమిది రోజులు కనీసం రూ.16వేలు అవుతుంది. కాస్త లగ్జరీగా గడపాలనుకుంటే రూ.30,000 కావాలి. అదే.. ఊటీ, కొడెకైనాల్, నీలగిరి హిల్స్ ప్రాంతాలను ఆరు రోజుల్లో చుట్టి రావాలంటే రూ.20,000 పైనే అవుతోంది. కానీ ఇంచుమించు ఇంతే ఖర్చుతో లేదా అంతకంటే తక్కువ వ్యయంతోనే మలేసియా, మారిషస్, మాల్దీవులు, సింగపూర్, దుబాయ్, శ్రీలంక వంటి దేశాలు చుట్టేయొచ్చు. ఉదాహరణకు మారిషస్ దేశంలో ఏడు రోజులుండటానికి కనీసం రూ.21,000 అవుతోందంటే పరిస్థితి తెలియకమానదు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమాన చార్జీలు ఎంత ముందుగా బుక్ చేసుకున్నా.. కనీసం రూ. 4,000-5,000 ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఇంతకంటే తక్కువ ధరలోనే కౌలాలంపూర్‌కు వెళ్లే అవకాశముంది. నేరుగా నలుగురైదుగురు కలిసి ప్లాన్ చేసుకుంటే ట్రావెల్ ఏజెన్సీ ధరకంటే చాల తక్కువ ధరలో ప్రయాణాన్ని ముగించుకొని రావచ్చు. ఇంటర్నేషనల్ రోమింగ్ లేదా లోకల్ సిమ్..! విదేశాలకు వెళ్లాక స్వదేశంలోని బంధుమిత్రులతో ఎలా కమ్యూనికేట్ చేయాలన్నది మరో కీలకమైన అంశం. ఇక్కడ వాడుతున్న సిమ్‌కే ఇంటర్నేషనల్ రోమింగ్ తీసుకోవడమా? లేక అక్కడ స్థానిక సిమ్ తీసుకోవడం ఉత్తమమా? అన్న ప్రశ్నకి సమాధానం మీ పర్యటన రోజులపై ఆధారపడి ఉంటుంది. తరచూ మీరు వ్యాపార, ఉద్యోగ అవకాశాలపై విదేశీ పర్యటనలు చేసేవారు అయితే ఇంటర్నేషనల్ రోమింగ్ తీసుకోవచ్చు. అలా కాకుండా కేవలం విహారం కోసం స్పల్పకాలానికి వెళ్ళేవారికి రోమింగ్ చాలా వ్యయంతో కూడుకున్నది. అలాంటి వారికి కాలింగ్ కార్డ్స్ అందుబాటులోకి వచ్చాయి. దాదాపు అన్ని ప్రముఖ సెల్యులర్ కంపెనీలతో పాటు వీటికోసమే ప్రత్యేకంగా ఏర్పడిన కంపెనీలు సైతం వీటిని అందిస్తున్నాయి. విదేశాలకు వెళ్లాక ఈ కాలింగ్ కార్డ్స్‌ను వినియోగించుకోవడం ద్వారా స్వదేశంలోని వారితో మాట్లాడొచ్చు. వీటి ధరలు రకరకాలుగా ఉంటాయి. వీటన్నిటితో పోలిస్తే వారం, పది రోజుల పాటు మాత్రమే ఉండేవారికి స్థానికంగా అక్కడి సిమ్ కార్డు తీసుకోవటమనేది చాలా మంచిదని నిపుణుల సూచన. కాలింగ్ కార్డు, ఇంటర్నేషనల్ రోమింగ్ చార్జీలతో పోల్చినపుడు లోకల్ సిమ్ ఛార్జీలే బెటరన్నది వీరి భావన. అయితే పెరిగిన టెక్నాలజీ కారణంగా ఇపుడు వైబర్ వంటి అప్లికేషన్లతో ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. వాట్స్ యాప్‌లో ఉచితంగా ఫొటోలు, ఆడియో-వీడియో ఫైల్స్ కూడా పంపించుకోవచ్చు. మరీ తక్కువ రోజులు టూర్‌కు వెళ్లేవారు కాస్త మంచి హోటళ్లలో దిగితే అక్కడ ఎలాగూ వైఫై ఉచితంగా లభిస్తుంది కనక ఈ కార్డులేవీ కొనకుండానే మేనేజ్ చేసే అవకాశం కూడా ఉంది. మాట్రిక్స్ సెల్యూటర్, క్లే టెలికం వంటి సంస్థలు ఇంటర్నేషనల్ సిమ్ కార్డులను అందిస్తుండగా... విదేశాల్లో కాఫీ షాప్‌లు, హోటళ్లు వంటి పలు ప్రాంతాల్లో ఉచిత ఇంటర్నెట్ లభించే అవకాశం ఉంది. కరెన్సీకి ఫారెక్స్ కార్డులూ ఉన్నాయ్.. విదేశీ పర్యటనకు టికెట్లు బుక్ చేసుకున్నాక ఆ దేశానికి నగదును ఎంత తీసుకెళ్లాలి? ఏ రూపంలో తీసుకెళ్లాలి? అనేది ప్రధానమైన సమస్య. విదేశాలకు ప్రధానంగా ఐదు రూపాల్లో అంటే పూర్తిగా నగదుగా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూపాల్లో... ట్రావెలర్స్ చెక్ రూపంలో లేదా ఫారెక్స్ కార్డు రూపంలో కరెన్సీ తీసుకెళ్లొచ్చు. ఈ ఐదింట్లోనూ కొన్ని లాభాలు, కొన్ని భయాలు ఉన్నాయి. వెళుతున్న దేశానికి సంబంధించిన కరెన్సీలోకి మార్చుకెళ్లడం సులువుగానే ఉంటుంది కానీ.. ఇంత మొత్తం నగదు రూపంలో తీసుకెళ్లటమనేది కొంత భయంతో కూడుకున్నదే. ఎందుకంటే అసలే అది మనకు తెలియని వాతావరణం. ఒకవేళ అనుకోని సంఘటన జరిగి నగదు పోగొట్టుకుంటే అంతే సంగతులు. అందుకని కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎప్పుడూ నగదును పరిమితంగానే తీసుకెళ్లాలి. ఒకవేళ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు , ఫారెక్స్ కార్డు రూపంలో తీసుకెళితే విమానం దిగినప్పటి నుంచి చిన్న మంచినీళ్ళ బాటిల్ తీసుకోవాలన్నా కార్డుపైనే చెల్లిస్తామంటే కష్టమవుతుంది. పెపైచ్చు విదేశాల్లో కొన్ని చోట్ల రోడ్‌సైడ్ మార్కెట్లుంటాయి. వాటిలో గనక ఏమైనా కొంటే కార్డుపై చెల్లించటం కష్టమవుతుంది. అందుకే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను నమ్మకమైన ప్రదేశాల్లో తప్ప విచ్చలవిడిగా విదేశాల్లో వినియోగించడం శ్రేయస్కరం కాదనేది నిపుణుల సూచన. ట్రావెలర్స్ చెక్కులు కూడా ఈ కార్డుల మాదిరిగానే కొన్ని చోట్ల పనికిరావు. పెపైచ్చు ప్రతిచోటా చిల్లర సమస్య ఉంటుంది. అందుకని విదేశాలకు వెళ్ళేటప్పుడు కొంత మొత్తం నగదును అమెరికన్ డాలర్ల రూపంలో తీసుకెళ్ళి మిగిలిన మొత్తాన్ని ఫారెక్స్ కార్డు రూపంలో తీసుకెళ్లటం మంచిది. ఎందుకంటే వెళ్లేది ఏ దేశమైనా అమెరికన్ డాలర్లు ఇచ్చి అక్కడి లోకల్ కరెన్సీని తీసుకోవటం చాలా తేలిక. పెపైచ్చు అంతర్జాతీయంగా చాలా దుకాణాల్లో అమెరికన్ డాలర్లు చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక ఫారెక్స్ కార్డుల వల్ల బ్రోకరేజీ చాలా తక్కువ పడుతుంది. పెపైచ్చు మనం వినియోగించకుండా మిగిలిపోయిన సొమ్మును తిరిగి స్వదేశానికి రాగానే మన మామూలు ఖాతాలోకి మళ్లించేసుకోవచ్చు. ఒకవేళ క్రెడిట్, డెబిట్ కార్డులు వాడితే ఆయా దేశాల కరెన్సీలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది కనక మన బ్యాంకులు (కార్డు ఇచ్చినవి) కరెన్సీ కన్వర్షన్ చార్జీల్ని వసూలు చేస్తాయి. ఫారెక్స్ కార్డుల్లో లోడ్ చేయించటానికి వసూలు చేసే బ్రోకరేజీ చార్జీల కంటే ఈ కన్వర్షన్ ఛార్జీలు చాలా ఎక్కువన్న సంగతి గుర్తుంచుకోవాలి. -
సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తాం: కెటిఆర్
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల భయాందోళనలను తొలగించడానికి హైదరాబాద్‌లో సద్భావనా యాత్రలు నిర్వహిస్తామని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామన్నారు. పులిచింతల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మానసికస్థితి బాగోలేదని కేటీఆర్ అన్నారు. అందుకే ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు.