ప్రస్తుతం ఆలుమగలు ఉరుకులు పరుగులు జీవితంతో పిల్లల ఆలనపాలన చూసుకోలేని స్థితిలో లేరు. అందులోనూ భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయితే పిల్లల బాగోగులు చూసుకోవడం అస్సలు కుదరదు. కాస్త స్తోమత ఉంటే డేకేర్ లేదంటే అమ్మమ్మ, నాయనమ్మల వద్ద ఉంచాల్సిందే. కానీ ఇక్కడొక అమ్మమ్మ తన మనవరాలిని చూసుకునేందుకు గంటకు రూ. 1600లు ఇవ్వాల్సిందేనని కూతురికి తెగేసి చెప్పింది. దీంతో కూతురు ఒక్కసారిగా షాక్ గురయ్యింది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకిలా ఆమె డిమాండ్ చేసిందంటే..
అసలేం జరిగిందంటే..ఓ వృద్ధ మహిళ తన సొంత మనవరాలిని సంరక్షణ కోసం, గంటకు రూ. 1600 ఛార్జ్ చేస్తానని కరాఖండీగా చెప్పింది కూతురికి. అంతేగాదు ఆ చిన్నారికి సంబంధించిన కొన్ని లగ్జరీ వస్తువులను కూడా డిమాండ్ చేసింది ఆ వృద్ధురాలు. ఈ విచిత్ర ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. కూతురు..."తన తల్లి వృద్ధురాలని, పైగా ఇంట్లో ఖాళీగానే ఉంది. కాబట్టి తాను తన కూతురిని చూసుకోమని అడిగాను. ఇది ఏమైనా అడగకూడని విషయమా!. తాను, తన భర్త ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నందువల్లే అడుతున్నా" అని కూతురు తల్లిని ప్రాధేయపడుతోంది.
తన తల్లి వయసు 64 ఏళ్లు అని, ప్రస్తుతం ఆమె ఏ ఉద్యోగం చేయడం లేదు. అందువల్ల ఆమెకు చాలా సమయం ఉంటుంది. కాబట్టి నా కుమార్తెను చూసుకోమని అడిగాను. కానీ ఆమె గంటకు సుమారు 16 పౌండ్ల ఛార్జీ ఇవ్వాలని చెబుతోంది. ఏం చేయాలో తెలియడం లేదని సోషల్ మీడియాలో వాపోయింది ఆ వృద్ధురాలి కూతురు. తన తల్లి ఆలస్య రుసుమును కూడా వసూలు చేస్తానని కరాఖండీగా చెప్పనట్లు తెలిపింది. అంతేగాదు కారులో ప్రత్యేక సీటు, స్టోలర్, బాటిల్ ఇతర వస్తువులు కూడా కావలని డిమాండ్ చేసిందంటూ గోడు వెల్లబోసుకుంది కూతురు. ఎందుకు ఆ వస్తువులన్నీ అడిగిందంటే.. తన తల్లి వస్తువులను శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించను కూడా ఉపయోగించదని ఆవేదనగా చెబుతోంది.
ఇంత మొత్తం చెల్లించాలంటే తాను అప్పులుపాలు కాక తప్పదని కూతురు ఒకటే గోల చేస్తోంది. కానీ సదరు వృద్ధురాలు తన డిమాండ్లను అంగీకరించకపోతే చూడనని నిర్మోహమాటం చెప్పేసింది. ఇక ఆమె ఒప్పుకోకపోతే కూతుర్ని డేకేర్‌లో పెడతానని చెబుతోంది. తన కుటంబంలో అందరూ నైన్ టు ఫైవ్ జాబే చేస్తారని, అందువల్లే తాను వాళ్ల అమ్మను కోరినట్లు పేర్కొంది. ఈ విషయం ప్రస్తుతం బ్రిటన్ అంతటా తెగ వైరల్ అవుతోంది.
నిజానికి చాలామంది వృద్ధులు లేదా ఇంట్లోని పెద్దవాళ్ల పట్ల ఇలాంటి ధోరణితోనే ఉంటారు. ఇది సరైనది కాదు. వృద్ధులు ఖాళీగా పనిపాట లేకుండా ఉంటారని అలుసుగా చూడకూడదు. జీవితంలో పడరాని పాట్లు కష్టాలు పడి మనల్ని పెంచినవారు. వారు జీవితంలో ఎన్నో వేదనలను గెలుపోటములు చూసి.. చూసి.. అలసిపోయిన వాళ్లు. వాళ్లకంటూ కాస్త ఏకాంతం కావాలని కోరుకుంటారు. ముందుగా వారి ఓపెనియన్ అడగాలి. వారి మనసెరిగి మసులుకుంటే చూసేదేమో ఆమె!. ఏమో ఆమె మనసులో ఏమూలనో ఏదో అభద్రతా భావం ఉంటేనే కథ ఇలా మాట్లాడతారు. ఒక్కసారి ఇలా ఆలోచించి వారిని అర్థం చేసుకునే యత్నం చేయండి.
కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఈ విషయం పట్ల నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందించారు. పిల్లలను చూసుకునే సామర్థ్యం లేప్పుడూ పిల్లల్ని కనాలనే ఆలోచన తీసుకోకుండా ఉండాల్సింది. లేదా గర్భధారణ సమయంలోనే తల్లితో మాట్లాడి ఉండాల్సింది. అయినా ఆమె ఇప్పటి వరకు మిమ్మల్ని సంరక్షించింది. ఇక మీ కూతుర్ని చూసుకోవాల్సింది మీ బాధ్యతే అని ఆమెకు చివాట్లు పెడుతూ పోస్ట్‌లు పెట్టారు.
(చదవండి: ఏనుగు చెవులు లాంటి అరుదైన ఆక్టోపస్! విస్తుపోయిన శాస్త్రవేత్తలు
Comments
Please login to add a commentAdd a comment