బెంగళూరు: మణిపూర్ శరణార్థుల విషయంలో కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ మంచి మనసు చాటుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా 29 మంది మణిపూర్ అమ్మాయిల బాధ్యతలను తీసుకుంటున్నట్లు ప్రకటించారాయాన.
మణిపూర్ అల్లర్ల కారణంగా.. మణిపూర్ నుంచి చాలామంది ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లారు. ఆ రాష్ట్రం నుంచి కొందరు కర్ణాటక చామరాజ్‌పేట సెయింట్ థెరెస్సా విద్యాసంస్థల్లో ఆశ్రయం పొందుతున్నారు. వాళ్లలో 29 మంది చదువుకునే వయసున్న అమ్మాయిలు ఉన్నారు.
ఆగష్టు 1వ తేదీన జమీర్ అహ్మద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లారు. ఆ అమ్మాయిలతో మాటామంతీ కలిపిన ఆయన వాళ్ల పరిస్థితికి చలించిపోయారు. తక్షణ సాయంగా రూ.2 లక్షలను ప్రకటించారాయన. ‘‘వాళ్ల చదువులు పూర్తి కావాలంటే ఏడేళ్లు పూర్తి కావొచ్చు. ఈ ఏడేళ్ల కాలంలో వాళ్లకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా. వాళ్లు ఇక్కడ ఉన్నంత కాలం సురక్షితంగా ఉండొచ్చు’’ అని ప్రకటించారాయన.
జమీర్ అహ్మద్ ‘నేషనల్ ట్రావెల్స్’ భాగస్వామ్య యాజమాని. చామరాజ్‌పేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారాయన. అందులో మూడుసార్లు జేడీఎస్ నుంచి.. రెండుసార్లు కాంగ్రెస్ తరపున నెగ్గారు. ప్రస్తుతం హౌజింగ్ & మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment