సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజలే చేస్తున్నారు కాని నాయకులు కాదని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి శుక్రవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై తీసుకున్న సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. విభజనతో నెలకొంటున్న సమస్యలపై సమాధానం చెప్పకుండా విభజన ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.
తామ లోక్సభ సభ్యత్వానికి రాజీనామాలను స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చామని గుర్తు చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఆంటోని కమిటీని కలసి తమ వాదనలు వినిపిస్తామని తెలిపారు. శనివారం సీమాంధ్ర ఎంపీలంతా ఇక్కడ సమావేశం కానున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ సమావేశానికి కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై రేపు జరిగే ఆ సమావేశంలో నిర్ణయిస్తామని అనంత వెంకట్రామిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు.