
'నీ ఆస్తిపాస్తులేమైనా ఉంటే నీ కొడుక్కు పంచుకో'
విజయవాడ : తెలంగాణ నోట్పై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపటంపై సీమాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. ఉదయం నుంచే విజయవాడతో పాటు కృష్ణాజిల్లా వ్యాప్తంగా బంద్ చేపట్టారు. రాష్ట్రాన్ని విభజిస్తే సిరులు పండే భూములు ఎడారులుగా మారే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదంటూ అయిదో నెంబర్ జాతీయ రహదారిపై టైర్లు కాల్చి, ఆందోళన చేస్తున్నారు. స్కూలు పిల్లల నుంచి.... మహిళలు, ప్రజలు ఆందోళనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోనియాగాంధీపై సామాన్య ప్రజానీకం నిప్పులు చెరుగుతున్నారు. " నీ ఆస్తిపాస్తులేమయినా ఉంటే కొడుక్కు పంచుకో సోనియామ్మ....అంతే కానీ రాష్ట్రాన్ని విభజించే హక్కు'' లేదంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం సరికాదన్నారు. రాజీవ్ మరణం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకోపోతే.... వైఎస్ రాజశేఖరరెడ్డి తన రెక్కల కష్టంతో అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. తనను ఎదిరిస్తే ఎవరినైనా జైల్లో పెట్టించటం.... అనుకూలంగా ఉంటే దగ్గర పెట్టుకోవటం కాంగ్రెస్
అధిష్టానానికి అలవాటుగా మారిందన్నారు.