గుంటూరు : ఆర్కిటెక్చర్ విద్యార్థి రుషితేశ్వరి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్‌ఎఫ్‌ఐ బుధవారం డిమాండ్ చేసింది. అందుకోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యూనివర్శిటీ విద్యార్థులు యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. తీశారు. రుషితేశ్వరి ఆత్మహత్య ఆ తర్వాత క్యాంపస్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో యూనివర్శిటీలోని అన్ని కాలేజీలకు 10 రోజుల పాటు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.
మళ్లీ తిరిగి బుధవారమే యూనివర్శిటీలోని అన్ని కాలేజీలు ప్రారంభమైనాయి. అయితే రుషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఈ ఘటనపై విచారణ జరుపుతున్న విషయం విదితమే.