
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు సోము వీర్రాజును కోరారు. వికేంద్రీకరణకు అనుకూలం అంటూనే అమరావతి ఫేక్ యాత్రకు ఎందుకు బీజేపీ మద్దతు తెలుపుతోందని వారు నిలదీశారు. సోము వీర్రాజు సూటిగా స్పందించకపోవడంతో వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజుతో వాగ్వాదానికి దిగారు.
చదవండి: మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన మాల మహానాడు
Comments
Please login to add a commentAdd a comment