సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఈటలకు నిరసన సెగ తలిగింది. వివరాలు.. పాపయ్యపల్లిలో ప్రవీణ్ యాదవ్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేదుకు బుధవారం ఈటల అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబ సభ్యులు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈటలను చూడగానే ఒక్కసారిగా తిట్లదండకం అందుకున్నారు. ఆయన వల్లే తమ బిడ్డ మృతి చెందాడని మృతుని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో ఏంచేయాలో తెలియని స్థితిలో ఈటల పోలీసుల సాయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.
చదవండి: (హుజురాబాద్ ఉప ఎన్నిక: ఆట ఆరంభం.. ఎవరూ తగ్గడం లేదు)
ఇదిలాఉండగా.. తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అక్టోబర్ 30న హుజురాబాద్ అసెంబ్లీ స్ధానానికి ఉపఎన్నిక జరగనుంది. ఫలితాలు నవంబర్ 2న వెల్లడిస్తారు.
చదవండి: (‘పోసాని భార్యను అవమానించడం దారుణం.. భగవంతుడే మీకు బుద్ధి చెప్తాడు’)
Comments
Please login to add a commentAdd a comment