సాక్షి, అమరావతి : సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు వెలగపూడిలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఉదయం ఆయన సైకిల్ తొక్కుకుంటూ వెలగపూడి సచివాలయం ప్రాంగణంలోకి వచ్చారు. అయితే నారాయణను మధ్యలోనే ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎవరూ ఉండరని, సైకిల్‌పై లోపలికి అనుమతి ఇవ్వబోమంటూ భద్రతా సిబ్బంది ...ఆయనను బయటకు పంపేశారు.
అయితే ఏదో సరదాగా అసెంబ్లీ చూద్దామని వస్తే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీ గుర్తైన సైకిల్‌పైనే తాను వస్తే అనుమతించకపోవడంతో ఆయన ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. అయినప్పటికీ ఉండబట్టలేక నారాయణ అసెంబ్లీ, సచివాలయం ముందు కాసేపు సైకిల్‌పై చక్కర్లు కొట్టారు. అలా అటూ ఇటూ తిరిగి తిరుగు పయనం అయ్యారు. ఇంతలో ఆయనకు మధ్యలో కల్లు కనిపించేసరికి టక్కున ఆగిపోయారు. వెంటనే సైకిల్ దిగి ఓ గ్లాస్ కల్లు గటగటా తాగేశారు.
Comments
Please login to add a commentAdd a comment