సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ దగ్గర సీపీఐ నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలపై నారాయణ చేసిన వ్యాఖ్యలను కార్మిక సంఘాల నేతలు ఖండించారు. నారాయణ ప్రసంగానికి కార్మిక సంఘాల నేతలు అడ్డుతగిలారు.
స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చి రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ కోసం అన్ని పార్టీలు పోరాటం చేస్తున్నాయని సూచించారు. ఇప్పటికే సీఎం రెండుసార్లు ప్రధానికి లేఖ రాశారని కార్మి సంఘాలు గుర్తుచేశాయి. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment