
ఓ వివాహ వేడుకకు వెళ్లిన టైంలో వేదిక నుంచి జారిపడిపోవడంతో..
సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 16వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన వేదిక ఎక్కబోతుండగా.. జారిపడ్డారు. ఆ తర్వాత అదేం పట్టించుకోకుండా మాములుగానే తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో ఆయన వైద్యుల్ని సంప్రదించడంతో ఆయన గాయపడినట్లు తేలింది. నారాయణకు రిబ్ ఎముక విరిగిందని.. రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.