
సాక్షి, ఢిల్లీ: పొత్తులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, క్రామేడ్ల కూటమి నిశ్చితార్థం స్టేజ్‌లో ఉందంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఎంఐఎంతో కలిసి కేసీఆర్ మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తారట. కేసీఆర్ నుంచి మేం ఇంకొంచెం ముందు బయటపడాలి. తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ కూటమిగా కలిస్తే కేసీఆర్‌కు డిపాజిట్లు రావు’’ అని పేర్కొన్నారు. బీజేపీ ఊగిసలాట నుంచి చంద్రబాబు బయటపడాలి. ఏపీలో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తే బెటర్’’ అంటూ నారాయణ వ్యాఖ్యానించారు.
కాగా, బీఆర్‌ఎస్‌తో బ్రేకప్ తర్వాత కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ రాయబారం మొదలుపెట్టింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో జత కట్టాలని భావిస్తోంది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఓ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు ఉండటం, ఇతర జిల్లాల్లోనూ అనేక చోట్ల ప్రభావితం చేయగలిగే పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తుకు సిద్ధం కావాలని యోచిస్తోంది.
చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం
Comments
Please login to add a commentAdd a comment