వరంగల్ పర్యటనలో భాగంగా టీ తాగుతూ వడ తింటున్న నారాయణ
న్యూశాయంపేట: రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే కేటీఆరే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉందని, సీఎం కేసీఆర్ ఇక విశ్రాంతి తీసుకుని తనయుడికి కుర్చీ అప్పగించి ఫామ్‌హౌజ్‌కే పరిమితమైతే మంచిదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. గురువారం వరంగల్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో పార్టీ నేతలతో కలసి పర్యటించిన ఆయన అనంతరం హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వరంగల్‌లో నాలాల కబ్జాకోరులు టీఆర్‌ఎస్ నాయకులేనని తీవ్రంగా విమర్శించారు.
కబ్జాల కారణంగా సుమారు 40 చెరువులు మాయమయ్యాయని ఆరోపించారు. ముంపు పరిష్కారానికి తాత్కాలిక చర్యలు కాకుండా వరంగల్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిరాశ్రయులైన కుటుంబాలకు రూ.10వేల చొప్పున నగదు, బియ్యాన్ని అందించాలన్నారు. రాష్ట్ర గవర్నర్ కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పుపడుతున్నారంటే.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అదుపు చేసే శక్తి ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment