
మంత్రి లోకేశ్‌కు చేదు అనుభవం
విజయవాడ: ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు, కృష్ణాజిల్లా సుబాబుల్ రైతులు మంగళవారం మంత్రి లోకేశ్‌ను కలిశారు. మూడేళ్ల నుంచి తమ డబ్బుల కోసం మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ, రేపు డబ్బులు ఇస్తామని తిప్పుతున్నారంటూ రైతులు ఆవేదన చెందారు.
310మంది రైతులకు సుమారు రూ.10 కోట్లు వరకూ రావాలని వారు తెలిపారు. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు కంటతడి పెట్టారు. తమ బాధలు చెప్పుకుంటున్న రైతులపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత సమయం ఓపిక పట్టాలని ఆయన రైతులకు సూచించారు. అయితే ఇంకెంతకాలం తాము ఓర్పుగా ఉండాలని రైతులు...మంత్రి లోకేశ్‌ను సూటిగా ప్రశ్నించారు.