ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి చేదు అనుభవం | JC diwakar reddy faces bitter experience in shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి చేదు అనుభవం

Published Sun, Jul 9 2017 8:33 AM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి చేదు అనుభవం

ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి చేదు అనుభవం

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి శంషాబాద్‌ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన  ఆయన ట్రూ జెట్‌ విమానంలో ప్రయాణించేందుకు టికెట్‌ కోసం యత్నించారు. అయితే  ట్రూ జెట్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారులు మాత్రం ఎంపీ జేసీకి టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో చేసేదేమీ లేక ఆయన వెనుదిరిగారు.

కాగా ఇండిగో ఎయిర్ లైన్స్‌  సిబ్బందిపై దాడి చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పై విమానయాన సంస్థలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. తమ సంస్థల విమానాల్లో ప్రయాణించకూడదని ఆంక్షలు పెట్టాయి. తమ సిబ్బందిపై దాడి చేసినందుకు ఇండగో నిషేదం విధించగా.. ఈ నిర్ణయానికి మద్దతుగా  ఎయిర్‌ ఇండియా, స్పైస్‌  జెట్‌,   జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా నిషేధాన్ని అమలు చేశాయి. బోర్డింగ్   పాస్  ఇవ్వడం లేదంటూ విశాఖ ఎయిర్ పోర్టులో ఇండిగో సిబ్బందిపై జేసీ దివాకర్‌ రెడ్డి దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement