True Jet
-
డిజిటల్ ఇండియా సేల్ : భారీ ఆఫర్లు
సాక్షి, ముంబై: రిపబ్లిక్ డే సందర్భంగా ‘‘డిజిటల్ ఇండియా సేల్’’ పేరుతో రిలయన్స్ డిజిటల్ ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై లభించే ఆఫర్లు ఈ నెల 26 వరకు అందుబాటులో ఉంటాయి. సిటీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ లావాదేవీలకూ ఇది వర్తిస్తుంది. కన్సూ్మర్ డ్యూరబుల్ లోన్ లావాదేవీలకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది. గరిష్టంగా రూ.10,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్‌లో ఈ ఆఫర్లు పొందొచ్చు. ట్రూజెట్ ట్రూ : రిపబ్లిక్ డే సేల్ విమానయాన సేవల రంగంలో ఉన్న ట్రూజెట్ తాజాగా ట్రూ–రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.926 నుంచి టికెట్ల ధరలు ప్రారంభం అవుతాయి. పన్నులు వీటికి అదనం. కస్టమర్లు జనవరి 23 నుంచి 27 మధ్య టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ కాలం ఏప్రిల్ 1 నుంచి అక్టోబరు 30 వరకు ఉంది. ట్రూజెట్‌ను హైదరాబాద్‌కు చెందిన టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రమోట్ చేస్తోంది. ఉడాన్ పథకంలో భాగంగా చిన్న నగరాల్లోని వినియోగదార్లకూ విమానయోగాన్ని కంపెనీ కలి్పస్తోంది. సంస్థ సేవలు అందిస్తున్న 21 కేంద్రాల్లో కడప, నాసిక్, నాందేడ్, బీదర్ సైతం ఉన్నాయి. -
ట్రూజెట్... చిల్డ్రన్స్ డే ప్రయాణం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విమానయాన రంగ సంస్థ ‘ట్రూజెట్’ పేద పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. 40 మంది పిల్లలను బుధవారం ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి సేలంకు తీసుకెళ్లింది. వీరంతా తమిళనాడుకు చెందిన ఎస్ఆర్వీవీ పాఠశాల విద్యార్థులు. వెల్లప సెంబనా గౌండర్ మెమోరియల్ ట్రస్ట్ సాయంతో పిల్లలకు విమానయాన అవకాశం కలిగింది. ‘వింగ్స్ ఆఫ్ హోప్’ కార్యక్రమం కింద ఏటా 300 మంది పేద పిల్లలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని ట్రూజెట్‌ను ప్రమోట్ చేస్తున్న టర్బో మేఘా ఎయిర్వేస్ కమర్షియల్ హెడ్ సెంథిల్ రాజా తెలియజేశారు. -
కేరళకు ట్రూజెట్ సాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు విమానయాన సంస్థ ట్రూజెట్ ముందుకొచ్చింది. దాతలు ఇచ్చిన మందులు, దుస్తులు, ఆహారం మొదలైనవి కేరళకు ఉచితంగా, త్వరగా చేర్చేందుకు సిద్ధమైంది. హైదరాబాద్, చెన్నై నుంచి వీటిని సేకరించి మంగళ, బుధ, గురువారాల్లో త్రివేండ్రంకు చేర్చనుంది. తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందించిన సామగ్రితో ఉదయం 5.30కి శంషాబాద్ నుంచి విమానం బయలుదేరి చెన్నైకి చేరుకుంటుంది. తమిళనాడు ప్రభుత్వం సేకరించిన సామగ్రితో అక్కడి నుంచి త్రివేండ్రం వెళుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో వరదల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను ఉచితంగా చెన్నై, హైదరాబాద్‌కు తీసుకు రావాలని నిర్ణయించినట్టు ట్రూజెట్ సీఈవో విశోక్ మాన్సింగ్ ఆదివారం తెలిపారు. ప్రతిరోజు ఆరు టన్నుల సామగ్రిని చేరవేయగలమని, 65 మంది ప్రయాణికులను తీసుకువస్తామని ఆయన చెప్పారు. -
జాతీయ క్యారియర్‌గా ట్రూజెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా రెండున్నరేళ్ల కిందట ప్రాంతీయ విమానయాన సంస్థగా సేవలు ఆరంభించిన ట్రూ జెట్.. జాతీయ స్థాయి సంస్థగా ఆవిర్భవిస్తోంది. టర్బో మేఘా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ సంస్థ... తాజాగా మరో 20 రూట్లలో విమాన సేవలు ఆరంభించేందుకు అనుమతులు సాధించినట్లు ప్రకటించింది. ప్రాంతీయంగా కనెక్టివిటీకి ఉద్దేశించిన ఉడాన్ పథకం రెండో దశ కింద ఈ 20 రూట్లలో తాము లైసెన్సులు పొందినట్లు టర్బో మేఘా ఎయిర్వేస్ హెడ్ (కమర్షియల్ విభాగం) సెంథిల్ రాజా తెలియజేశారు. కొత్త రూట్లలో అహ్మదాబాద్ – పోర్బందర్, జైసల్మేర్, నాసిక్, జల్గామ్, గౌహతి– కుచిహార్, బర్నపూర్, తేజు, తేజపూర్ తదితరాలున్నాయి. ‘‘ఇప్పటిదాకా ట్రూజెట్ ద్వారా 10 లక్షల మంది ప్రయాణించారు. తాజా రూట్లతో పశ్చిమ, తూర్పు తీరంతో పాటు ఈశాన్య భారత్‌లో కూడా సేవలు విస్తరించినట్లు అవుతుంది. ఈ నెల 25న చెన్నై–సేలం రూట్లో విమాన సేవలు ప్రారంభిస్తున్నాం. ప్రమోషనల్ ఆఫర్‌గా టికెట్‌ను రూ.599కే ఆఫర్ చేస్తున్నాం’’ అని రాజా వివరించారు. ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ దిగ్గజం ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్)లో టర్బోమేఘా ఎయిర్వేస్ భాగంగా ఉంది. మరో ఏడు విమానాల కొనుగోలు.. ట్రూజెట్‌కు ప్రస్తుతం 5 విమానాలున్నాయి. వీటితో 13 ప్రాంతాలకు రోజుకు 32 సర్వీసులు నడుపుతోంది. త్వరలోనే మరో ఏడు విమానాలను సమకూర్చుకోనున్నట్లు రాజా చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, ఔరంగాబాద్ రూట్లతో పాటు ఉడాన్ స్కీమ్ కింద కడప, ఔరంగాబాద్, మైసూరు ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా రోజూ సుమారు 2 వేల మందిని వివిధ ప్రాంతాలకు చేరుస్తున్నట్లు తెలియజేశారు. సీఎఫ్ఎంతో స్పైస్‌జెట్ భారీ డీల్ గురుగ్రామ్: విమానయాన సేవల సంస్థ స్పైస్‌జెట్ తాజాగా జెట్ ఇంజిన్ల తయారీ సంస్థ సీఎఫ్ఎం ఇంటర్నేషనల్‌తో 12.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. లీప్ 1బీ ఇంజిన్ల కొనుగోలు, సర్వీసులకు ఈ డీల్ ఉపయోగపడనుంది. ప్రస్తుతం తమ విమానాల్లో ఉపయోగిస్తున్న సీఎఫ్ఎం56 కన్నా లీప్–1బీ ఇంజిన్లు సమర్థమంతంగా ఉండగలవని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం 38 పైచిలుకు ’సీఎఫ్ఎం56–7బి’ ఇంజిన్ల ఆధారిత బోయింగ్ ’737’ రకం విమానాలు స్పైస్‌జెట్ ఉపయోగిస్తోంది. -
మార్చి 1న విడుదల
సాక్షి, కడప : ఎన్నో ఏళ్ల క్రితం బ్రిటీషు హయాంలో నెలకొల్పిన కడప ఎయిర్‌పోర్టుకు కేంద్రం పుణ్యమా అని కొత్త కళ వస్తోంది. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఎయిర్‌పోర్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎయిర్‌పోర్టు అద్భుతంగా ఉన్నా విమాన రాకపోకలు మాత్రం అప్పుడప్పుడు మాత్రమే సాగేవి. అయితే ఇటీవల కేంద్రప్రభుత్వం రీజినల్ కనెక్టివిటీ స్కీం ద్వారా చిన్నచిన్న స్టేషన్లను కలుపుతూ అందరికీ విమానయోగం కల్పించాలన్న సంకల్పంతో ప్రధాని పలు విమాన సర్వీసులను ప్రారంభించారు. అప్పటి నుంచి కేంద్రం ప్రయాణికులతో సంబంధం లేకుండా విమాన యాజమాన్యాలకు సీట్ల అనుగుణంగా డబ్బులు చెల్లిస్తూ వస్తోంది. తద్వారా కడప లాంటి ఎయిర్‌పోర్టులకు కూడా మహర్దశ వస్తోంది. ప్రతిరోజు రెండు విమాన సర్వీసులు కడప మీదుగా నడవనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై సర్వీసులు హైదరాబాద్ నుంచి ట్రూజెట్‌కు చెందిన విమానం రాకపోకలు సాగిస్తోంది. ప్రతిరోజు హైదరాబాద్ నుంచి ఉదయం కడపకు రావడం, అనంతరం కడప నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేది. ఈ సర్వీసును 2017 ఏప్రిల్ 27వ తేదీన ప్రధాని మోదీ రిమోట్ ద్వారా ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా సాగుతోంది. కడప నుంచి చెన్నైకి కూడా గత ఏడాది నవంబర్ 16 నుంచి విమాన సర్వీస్‌ను ప్రారంభమైంది. ప్రస్తుతం కడప–హైదరాబాద్, కడప–చెన్నైల మధ్య సర్వీస్‌లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన ఉంది. మార్చి 1నుంచి విజయవాడకు సర్వీస్ కడప నుంచి రాజధానికి సర్వీస్ నడిపేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్చి 1 నుంచి కడప–విజయవాడ సర్వీస్ ప్రారంభం కానుంది. అవసరమైన అన్ని అనుమతులు లభించాయి. దీంతో రాజధాని ప్రాంతానికి కడప నుంచి వెళ్లడానికి విమాన సర్వీస్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ప్రయాణికులు కూడా టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. WWW.TQUJET.COM టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రయాణికులకు ట్రూజెట్ ఆఫర్ కడప నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ప్రస్తుతం కడప నుంచి రైళ్లు, ఏసీ బస్సుల్లో ప్రయాణ టిక్కెట్ కంటే కూడా విమానంలో తక్కువ చార్జీ అంటే ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఎందుకంటే ట్రూజెట్ సంస్థ కడప నుంచి విజయవాడ విమాన సర్వీసు ప్రారంభాన్ని పురస్కరించుకుని బంపర్ ఆఫర్ ఇచ్చింది. కేవలం రూ.798 ప్రారంభ ధరగా నిర్ణయించారు. త్వరపడిన వారికే లిమిటెడ్ సీట్ల మేరకు అవకాశం లభిస్తుంది. సద్వినియోగం చేసుకోవాలి కడప నుంచి హైదరాబాద్, చెన్నై, విజయవాడలకు విమాన సర్వీసులు నడుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కడప ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పూసర్ల శివప్రసాద్ పిలుపునిచ్చారు. విజయవాడ–కడప మధ్య నడుస్తున్న విమాన సర్వీసులకు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుంటే టిక్కెట్ ధర తగ్గుతుందన్న విషయాన్ని ప్రయాణికులు గమనించాలన్నారు. కడప నుంచి హైదరాబాద్, విజయవాడ, చెన్నైలకు సర్వీస్‌లు ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. -
కొత్త నగరాలకు ‘ట్రూజెట్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజెట్ పేరుతో ప్రాంతీయ విమానయాన సేవల్లో ఉన్న టర్బో మేఘా ఎయిర్వేస్... జనవరి 19 నాటికి 10 లక్షల మంది ప్రయాణికులను వివిధ నగరాలకు చేరవేసి మిలియన్ మార్కును దాటింది. తాజాగా ట్రూజెట్ ఖాతాలో 5వ ఎయిర్‌క్రాఫ్ట్ చేరికతో కొత్త నగరాల్లో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఫిబ్రవరి నుంచి సేలంలో అడుగుపెడుతోంది. మార్చిలో షిర్డీ, ఏప్రిల్‌లో వైజాగ్‌కు సర్వీసులను అందిస్తామని టర్బో మేఘా ఎయిర్వేస్ కమర్షియల్ హెడ్ సెంథిల్ రాజా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఉడాన్ స్కీమ్ కింద కడప, మైసూరు, విద్యానగర్, నాందేడ్‌కు విమానాలు నడుపుతున్నట్టు చెప్పారు. కొత్త పైలట్లు, సిబ్బంది చేరగానే సర్వీసులు పెంచుతామన్నారు. మే నాటికి ఆరవ విమానం.. ఈ ఏడాది మే నాటికి ఆరవ విమానం వచ్చి చేరుతుందని సెంథిల్ తెలిపారు. ‘2018 డిసెంబరుకల్లా కంపెనీ ఖాతాలో 8 విమానాలు ఉంటాయి. ప్రస్తుతం 12 నగరాలకు సర్వీసులు నడిపిస్తున్నాం. ఈ ఏడాది మరో 4 నగరాల్లో అడుగు పెడతాం. సర్వీసుల సంఖ్య 20 ఉంది. కొత్త నగరాలు, విమానాల రాకతో ఇది మూడు రెట్లకు చేరుతుంది. సీట్ల ఆక్యుపెన్సీ 77 శాతముంది. ఇది 85 శాతానికి పైగా చేరుతుందని అంచనా వేస్తున్నాం. 500 మంది సిబ్బంది ఉన్నారు. మరో 100 మందిని నియమించుకుంటున్నాం. ట్రూజెట్ మాత్రమే ఉడాన్ స్కీమ్ కింద దక్షిణాది నుంచి సర్వీసులు అందిస్తోంది. 2018 చివరికి మరో 10 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తామన్న దీమాతో ఉన్నాం’ అని వివరించారు. కంపెనీ కార్యకలాపాలు 2015 జూలై 12న ప్రారంభం అయ్యాయి. -
ఉత్తరాది నగరాలకూ ట్రూజెట్
♦ టెండర్లలో పాల్గొననున్న టర్బో మేఘా ♦ సెప్టెంబర్‌కల్లా మరో 18 సర్వీసులు ♦ ఆరు నెలల్లో కొత్తగా 4 విమానాలు ♦ ‘సాక్షి’తో కంపెనీ ఎండీ ఉమేశ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజెట్ పేరుతో విమానయాన రంగంలో ఉన్న టర్బో మేఘా ఎయిర్వేస్ కొత్త నగరాలకు సర్వీసులు విస్తరించటంపై ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ మహారాష్ట్ర, గుజరాత్‌లోనూ అడుగుపెట్టడానికి ఉడాన్ ప్రాజెక్టు కింద ఈ నెలలో జరిగే టెండర్లలో పాల్గొనబోతోంది. ఈ రాష్ట్రాల్లో కమర్షియల్ రూట్లలో సైతం సర్వీసులు నడుపనున్నట్టు సంస్థ ఎండీ ఉమేష్ వంకాయలపాటి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. మూడు నాలుగు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయి రూట్ల కేటాయింపు జరగొచ్చని వెల్లడించారు. జనవరి–ఫిబ్రవరికల్లా మహారాష్ట్ర, గుజరాత్‌లోని ప్రధాన ద్వితీయ శ్రేణి నగరాల్లో సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. ట్రూజెట్ దేశంలో తొలిసారిగా షెడ్యూల్డ్ కమ్యూటర్ ఆపరేటర్‌గా మే నెలలో అనుమతి పొందింది. దీంతో మెట్రోల నుంచి ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందించేందుకు కంపెనీకి వీలు కలిగింది. అదనపు సర్వీసులు.. ప్రస్తుతం ట్రూజెట్ 11 నగరాలకుగాను రోజుకు 28 సర్వీసులను నడిపిస్తోంది. సెప్టెంబర్ చివరినాటికి మరో నాలుగు నగరాలను అనుసంధానిస్తోంది. తద్వారా రోజుకు కొత్తగా 18 సర్వీసులను జోడించనుంది. కంపెనీ ఖాతాలో ఇప్పుడు ఏటీఆర్–72 రకం ఫ్లైట్లు నాలుగు ఉన్నాయి. ఆగస్టులో ఒకటి, సెప్టెంబర్‌లో మరొక విమానం వచ్చి చేరుతోంది. ఇవేగాక మహారాష్ట్ర, గుజరాత్ కోసం మరో రెండు విమానాలు అవసరం అవుతాయని కంపెనీ భావిస్తోంది. కంపెనీ దక్కించుకునే రూట్లనుబట్టి కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కేంద్రంగా కొల్హాపూర్, షోలాపూర్, జల్గావ్, నాసిక్, గోందియా, లాతూర్ వంటి నగరాలకు సర్వీసులను విస్తరిస్తారు. ఇక కంపెనీలో ప్రస్తుతం 500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. విస్తరణలో భాగంగా కొత్తగా 100 మందిని నియమించుకోనున్నారు. ఈ ఏడాది మరో రూ.70 కోట్లు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.60–70 కోట్లు వెచ్చించనున్నట్టు ఉమేష్ వెల్లడించారు. నిధుల సమీకరణ ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. ఉడాన్ ప్రాజెక్టుతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, కంపెనీకి ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. ‘‘టికెట్ల ధరల సవరణ ఇప్పట్లో లేదు. మా విమానాల్లో ఆక్యుపెన్సీ రేటు 80–85 శాతంగా ఉంది. సివిల్ ఏవియేషన్ నుంచి షిర్డీ విమానాశ్రయానికి ఇంకా క్లియరెన్సు రావాల్సి ఉంది. అనుమతి రాగానే అక్కడికి సర్వీసులు ఆరంభిస్తాం’’ అని వివరించారు. బుధవారం నాటితో కంపెనీ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్లలో 7.60 లక్షల మంది తమ విమానాల్లో ప్రయాణించినట్లు ఉమేష్ వెల్లడించారు. -
ట్రూజెట్ వార్షికోత్సవ ఆఫర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజెట్ పేరుతో విమానయాన రంగంలో సేవలందిస్తున్న టర్భో మేఘా ఎయిర్వేస్ మూడో వసంతంలోకి అడుగుపెడుతోంది. కార్యకలాపాలు ప్రారంభించి నేటితో (జూలై 12) రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అన్ని పన్నులు కలుపుకుని టికెట్ల ధర రూ.802 నుంచి ఆఫర్ చేస్తోంది. -
ఎయిర్‌పోర్టు వివాదంపై మాట్లాడను: జేసీ
విజయవాడ: విశాఖ విమానాశ్రయం వివాదంపై తానేమీ మాట్లాడనని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తానేమీ మాట్లాడినా ఉన్నది లేనట్లుగా చూపిస్తున్నారని ఆయన సోమవారమిక్కడ మండిపడ్డారు. మీడియా మేనేజ్మెంట్లు తమపై ఆధారపడి బతుకున్నాయని జేసీ వ్యాఖ్యానించారు. ఎంపీల సమావేశంలో తన వివాదంపై చర్చ జరగలేదని, ఆ సమావేశంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా ఉన్నారన్నారు. ఆయన కూడా తనను ఏమీ అడగలేదని జేసీ పేర్కొన్నారు. కాగా శంషాబాద్ విమానాశ్రయంలో జేసీ దివాకర్ రెడ్డికి నిన్న చేదు అనుభవం ఎదురైంది. ట్రూజెట్ ఎయిర్‌లైన్స్ టూటీ–200 విమానంలో ఉదయం 6.40 గంటలకు విజయవాడ వెళ్లేందుకు ఆయన విమానాశ్రయానికి వచ్చారు. ముందుగానే టికెట్ తీసుకున్న ఆయన బోర్డింగ్ పాస్ తీసుకునేందుకు విమానాశ్రయంలోకి వెళ్లగా ట్రూజెట్ సంస్థ ఆయన ప్రయాణానికి అడ్డుచెప్పింది. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. గత నెల విశాఖపట్నం విమానాశ్రయంలో ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో బోర్డింగ్ పాస్‌ను నిరాకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో జేసీ గొడవపడిన విషయం తెలిసిందే. -
ఎంపీ జేసీకి చేదు అనుభవం
ప్రయాణానికి నిరాకరించిన ట్రూజెట్ శంషాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఆదివారం శంషాబాద్ విమానాశ్ర యంలో చేదు అనుభవం ఎదురైంది. ట్రూజెట్ ఎయిర్‌లైన్స్ టూటీ–200 విమా నంలో ఉదయం 6.40 గంటలకు విజయవాడ వెళ్లేందుకు ఆయన విమానా శ్రయానికి వచ్చారు. ముందుగానే టికెట్ తీసుకున్న ఆయన బోర్డింగ్ పాస్ తీసుకునేందుకు విమానాశ్రయంలోకి వెళ్లగా ట్రూజెట్ సంస్థ ఆయన ప్రయాణా నికి అడ్డుచెప్పింది. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. గత నెల విశాఖపట్నం విమానాశ్రయంలో ఆలస్యం గా ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో బోర్డింగ్ పాస్‌ను నిరాకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో జేసీ గొడవపడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇండిగో, ఎయిర్ఇండియా ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆయన ప్రయాణంపై నిషేధం విధించాయి. కాగా శనివారం రాత్రి కూడా స్పైస్‌జెట్ ఎయిర్ లైన్స్ విమానంలో జేసీ విజయవాడ బయ లుదేరేందుకు ప్రయత్నించగా, సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ నిరాకరించినట్లు విశ్వసనీయ సమాచారం. -
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చేదు అనుభవం
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఆయన ట్రూ జెట్ విమానంలో ప్రయాణించేందుకు టికెట్ కోసం యత్నించారు. అయితే ట్రూ జెట్ ఎయిర్‌లైన్స్ అధికారులు మాత్రం ఎంపీ జేసీకి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చేసేదేమీ లేక ఆయన వెనుదిరిగారు. కాగా ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై దాడి చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పై విమానయాన సంస్థలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. తమ సంస్థల విమానాల్లో ప్రయాణించకూడదని ఆంక్షలు పెట్టాయి. తమ సిబ్బందిపై దాడి చేసినందుకు ఇండగో నిషేదం విధించగా.. ఈ నిర్ణయానికి మద్దతుగా ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ కూడా నిషేధాన్ని అమలు చేశాయి. బోర్డింగ్ పాస్ ఇవ్వడం లేదంటూ విశాఖ ఎయిర్ పోర్టులో ఇండిగో సిబ్బందిపై జేసీ దివాకర్ రెడ్డి దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. -
ట్రూజెట్ విజయవాడ- చెన్నై విమాన సర్వీసు
గన్నవరం: ట్రూజెట్ విమాన సంస్థ కృష్ణాజిల్లా గన్నవరం (విజయవాడ) విమానాశ్రయం నుంచి కడప మీదుగా చెన్నైకు కొత్త విమాన సర్వీసును మంగళవారం ప్రారంభించింది. వారంలో మూడు రోజుల పాటు ఈ సర్వీసు నడుపుతారు. ఈ సర్వీసుల్లో ప్రయాణించే వారికి రూ. 999లకే టికెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ స్టేషన్ ప్రతినిధి కిశోర్ తెలిపారు. -
ఎగిరిన విమానం.. ఫార్మాకు గాయం
► ఆస్తులు విక్రయించి గట్టెక్కుతున్న ఇన్ఫ్రా కంపెనీలు ► 2016లో నష్టాలు మరింత తగ్గి లాభాలు చూసే అవకాశం ► ఐటీలో అత్యున్నత పదవులకు ఎగుస్తున్న తెలుగు తేజాలు ► ఆసుపత్రుల్లో వాటాలకు విదేశీ ఇన్వెస్టర్ల భారీ ఆఫర్లు ఎగిరే అవకాశాలను అందుకోవటానికి విమానయానంలోకి కొత్త కంపెనీలొచ్చాయి. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణ దిశగా మరింత పెకైగిశాయి. కొన్నేళ్లుగా నష్టాలతో కునారిల్లుతున్న ఇన్ఫ్రా రంగం కాస్తంత తేరుకుంది. కంపెనీలు ఆస్తులు విక్రయించి రుణ భారం దించుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు కాస్త సఫలమయ్యాయి. ఐటీలో మనవాళ్లు విజయబావుటాలు ఎగురవెయ్యగా... హెల్త్కేర్లోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. ఆసుపత్రుల విలువలు అమాంతం ఎగిశాయి. కానీ మన ఫార్మా రంగం మాత్రం బోలెడంత అప్రదిష్ట మూటగట్టుకుంది. వచ్చే ఏడాది ఈ మచ్చను తుడిచేసే ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన చూస్తే... ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలకు సానుకూలంగా గడవగా... వచ్చే ఏడాది మరిన్ని ఆశలు రేపుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలకు తోడు, వడ్డీరేట్లు, చమురు, లోహాల ధరలు దిగిరావడంతో ఇన్ఫ్రా కంపెనీలు కవరీ బాట పట్టాయి. ఎన్సీసీ, గాయత్రీ వంటి కంపెనీలు లాభాల బాట పట్టగా, జీవీకే, జీఎంఆర్, ల్యాంకో సంస్థలు నష్టాలు తగ్గించుకున్నాయి. కేంద్రం ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్‌కు ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటంతో వచ్చే ఏడాది అన్ని కంపెనీలూ లాభాల్లోకి రావచ్చనేది అంచనా. అప్పుల ఊబిలో కూరుకున్న జీవీకే, జీఎంఆర్, ల్యాంకో, ఐవీఆర్సీఎల్లు ఆస్తులను విక్రయించడం ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఐవీఆర్‌సీఎల్‌కు ఈ సంవ త్సరం చేదు అనుభవం మిగిలింది. అప్పుల భారం తప్పటానికి చేసిన యత్నాలు విఫలం కావటంతో కంపెనీపై యాజమాన్య హక్కులను పొందడానికి బ్యాంకులు ఎస్డీఆర్ అస్త్రాన్ని ప్రయోగించాయి. అంతేకాకుండా కంపెనీని ఈపీసీ, అసెట్స్‌గా విడదీయాలని నిర్ణయించాయి. ఫార్మాకి మాయని మచ్చ దేశంలో రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఉన్న డాక్టర్ రెడ్డీస్‌కి చెందిన మూడు తయారీ కేంద్రాలకు యూఎస్ఎఫ్డీఏ వార్నింగ్ లేఖలను జారీ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయమయ్యింది. సన్ ఫార్మా, మైలాన్ యూనిట్లకూ ఈ తరహా లేఖలు వచ్చినా ఇంత పెద్ద చర్చ జరగలేదు. కారణం... రెడ్డీస్‌కి చెందిన మూడు యూనిట్లకు ఒకేసారి హెచ్చరిక లేఖలు రావడమే. విజయనగరం ఏపీఐ యూనిట్లో సమస్యలున్న సంగతి తెలుసుకానీ, తెలంగాణలోని మిర్యాలగూడ ఏపీఐ యూనిట్, విశాఖ సమీపంలోని దువ్వాడ వద్ద ఉన్న క్యాన్సర్ యూనిట్లో సమస్యలున్నట్లు ఇప్పటిదాకా వెల్లడి కాకపోవటం సమస్య తీవ్రతను పెంచింది. డాక్టర్ రెడ్డీస్ తర్వాత అంత చర్చజరిగిన అంశం ఏదైనా ఉందంటే అది క్లినికల్ ట్రయల్స్ సంస్థ జీవీకే బయోదే. ఈ సంస్థ జరిపిన క్లినికల్ ట్రయల్స్ నివేదికలు తప్పులతడకలుగా ఉన్నాయంటూ జీవీకే బయో పరీక్షలు నిర్వహించిన 700 జెనరిక్ డ్రగ్స్‌ను యూరోపియన్ యూనియన్ నిషేధించింది. ఇది కంపెనీ పేరు ప్రతిష్టలకు పెద్ద విఘాతం కల్గించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశీయ ఫార్మా కంపెనీలు కొత్త ఔషధాలకు అనుమతులు బాగానే పొందాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో, నాట్కో, డాక్టర్ రెడ్డీస్, సువెన్‌లైఫ్ వంటి కంపెనీలు అనేక జెనరిక్ ఔషధాలకు అనుమతులు, పేటెంట్లను దక్కించుకున్నాయి. జపాన్, ఆఫ్రికా దేశాల వంటి కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడంతో రానున్న కాలంలో దేశీ ఫార్మా మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అంచనా. విమానయానంలో జెట్ స్పీడ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది అత్యధిక సానుకూల పరిణామాలు చోటు చేసుకున్న రంగాలేమైనా ఉంటే అవి విమానయాన, తత్సంబంధిత రంగాలే. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్‌కోస్టాకు ఈ ఏడాది నేషనల్ కారియర్‌గా ప్రమోషన్ లభించింది. హైదరాబాద్ కేంద్రంగా ట్రూజెట్ పేరుతో మరో ప్రాంతీయ విమాన సర్వీసు సంస్థ ప్రారంభమయింది. ఈ కంపెనీకి టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ డైరక్టర్‌గా ఉండటమే కాకుండా ట్రూజెట్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా. కొత్తగా కడప విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. విశాఖ దగ్గర మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు వుర్గం సుగమమైంది.. తిరుపతి సమీపంలోని రేణుగుంటలో కొత్త అంతర్జాతీయ టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్.. బోయింగ్‌తో కలిసి ‘ఏహెచ్ 64’ హెలికాప్టర్లను తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీవోల సందడి కొనేళ్ల విరామం తర్వాత తెలుగు రాష్ట్ర కంపెనీలు తిరిగి స్టాక్ మార్కెట్లో సందడి చేశాయి. ఇప్పటికే రెండు కంపెనీలు ఐపీవోకి రాగా, మరొక కంపెనీకి అనుమతులు లభించాయి. ఇన్ఫ్రా రంగానికి చెందిన పెబ్స్ పెన్నార్, పవర్‌మెక్ కంపెనీలు స్టాక్ మార్కెట్ ద్వారా రూ.330 కోట్లు సమీకరించాయి. ఇందులో పెబ్స్ పెన్నార్ ఇన్వెస్టర్లను నిరాశపర్చగా, పవర్‌మెక్ స్వల్ప లాభాలు అందించింది. ఐపీవోకి రావడానికి అనుమతులు పొందిన విత్తన కంపెనీ నూజివీడు సీడ్స్ సరైన పరిస్థితుల కోసం ఎదురు చూస్తోంది. ఐటీలో తెలుగు వెలుగులు ఈ ఏడాది ఐటీలో తెలుగు తేజాలు మెరిశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కి తెలుగు తేజం సత్య నాదెళ్ల సీఈవోగా నియమితులయ్యారు. అలాగే దేశంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకున్న నాస్కామ్‌కి చైర్మన్‌గా బీ.వి.ఆర్. మోహన్ రెడ్డి నియమితులు కావడం విశేషం. సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ సీఈవోగా విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ పోటీ పడినా చివర్లో ఆ అవకాశాన్ని కోల్పోయారు. హాస్పిటల్స్ విలువలు జూమ్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హాస్పిటల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. కేర్, గ్లోబల్, కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో వాటాలను విదేశీ సంస్థలు అత్యధిక ధరకు కైవసం చేసుకున్నాయి. ఈ మధ్యనే కేర్ హాస్పిటల్స్‌లో 72 శాతం వాటాను అడ్వెంట్ ఇంటర్నేషనల్ నుంచి రూ. 1,800 కోట్లకు సింగపూర్‌కు చెందిన టెమాసెక్ కొనుగోలు చేసింది. ఈ వాటాను 2012లో అడ్వెంట్ రూ. 680 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే గ్లోబల్ హాస్పిటల్స్‌లో 74 శాతం వాటాను మలేషియా కంపెనీ పార్క్‌వే హాస్పిటల్ (ఐహెచ్‌హెచ్ గ్రూపు) రూ. 2,150 కోట్లకు కొన్నది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో 51% వాటాకోసం ఐహెచ్‌హెచ్ గ్రూపు రూ. 300 కోట్లు వెచ్చించింది. చిన్నాచితకా హాస్పిటల్స్ కూడా చేతులు మారాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నోవా హాస్పిటల్స్‌ను రూ. 140 కోట్లకు అపోలో కొనుగోలు చేసింది. ఇప్పటికే రెయిన్బో, కిమ్స్ హాస్పిటల్స్‌లో ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు తమ వాటాలను మరింత పెంచుకునే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే 2016లో హాస్పిటల్స్ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.