
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విమానయాన రంగ సంస్థ ‘ట్రూజెట్’ పేద పిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. 40 మంది పిల్లలను బుధవారం ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి సేలంకు తీసుకెళ్లింది. వీరంతా తమిళనాడుకు చెందిన ఎస్‌ఆర్‌వీవీ పాఠశాల విద్యార్థులు.
వెల్లప సెంబనా గౌండర్ మెమోరియల్ ట్రస్ట్ సాయంతో పిల్లలకు విమానయాన అవకాశం కలిగింది. ‘వింగ్స్ ఆఫ్ హోప్’ కార్యక్రమం కింద ఏటా 300 మంది పేద పిల్లలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని ట్రూజెట్‌ను ప్రమోట్ చేస్తున్న టర్బో మేఘా ఎయిర్‌వేస్ కమర్షియల్ హెడ్ సెంథిల్ రాజా తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment