ఎంపీ జేసీకి చేదు అనుభవం
ప్రయాణానికి నిరాకరించిన ట్రూజెట్
శంషాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఆదివారం శంషాబాద్ విమానాశ్ర యంలో చేదు అనుభవం ఎదురైంది. ట్రూజెట్ ఎయిర్‌లైన్స్ టూటీ–200 విమా నంలో ఉదయం 6.40 గంటలకు విజయవాడ వెళ్లేందుకు ఆయన విమానా శ్రయానికి వచ్చారు. ముందుగానే టికెట్ తీసుకున్న ఆయన బోర్డింగ్ పాస్ తీసుకునేందుకు విమానాశ్రయంలోకి వెళ్లగా ట్రూజెట్ సంస్థ ఆయన ప్రయాణా నికి అడ్డుచెప్పింది.
దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. గత నెల విశాఖపట్నం విమానాశ్రయంలో ఆలస్యం గా ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో బోర్డింగ్ పాస్‌ను నిరాకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో జేసీ గొడవపడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇండిగో, ఎయిర్‌ఇండియా ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆయన ప్రయాణంపై నిషేధం విధించాయి. కాగా శనివారం రాత్రి కూడా స్పైస్‌జెట్ ఎయిర్ లైన్స్ విమానంలో జేసీ విజయవాడ బయ లుదేరేందుకు ప్రయత్నించగా, సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ నిరాకరించినట్లు విశ్వసనీయ సమాచారం.