క్యాబ్ సేవల సంస్థ ఓలాకు సంబంధించి మరో షాకింగ్ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో క్యాబ్ బుక్ చేసుకున్న ఓ విద్యార్థికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బుక్ చేసుకున్నపుడు ఉన్న ఫీజుకి, తీరా చెల్లించాల్సిన సొమ్ముకి ఉన్న తేడా చూసి కంగు తిన్నాడు. ఇదేం చోద్యం బాసూ అంటూ లబోదిబోమన్నాడు. చివరికి ఏమైందంటే..?
కోల్‌కతా నుంచి బెంగళూరుకు వచ్చిన అనురాగ్ కుమార్ సింగ్ అనే కాలేజీ విద్యార్థి కెంపేగౌడ విమానాశ్రయంలో ఓలా 'మినీ' క్యాబ్‌ను చేసుకున్నాడు. ఓలా బుక్ చేసుకున్న మతికెరె ప్రాంతానికి సమయంలో ధర రూ.730 చూపించింది. తీరా రైడ్ ముగిసిన తరువాత రూ.5194 చెల్లించాలని డ్రైవర్ డిమాండ్ చేశాడు. దిగ్భ్రాంతికి గురైన అనురాగ్ వెంటనే తన ఫోన్‌లో చెక్ చేస్తే రైడ్ క్యాన్సిల్ అయినట్లు చూపించింది. క్యాన్సిల్ అయిన రైడ్‌కు అంత డబ్బులు ఎలా వసూలు చేస్తావంటూ డ్రైవర్‌ని నిలదీశాడు.దీంతో ఇద్దరి మధ్యా కాసేపు వాగ్వాదం జరిగింది. ఓలా కస్టమర్‌కేర్‌ను కూడా సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయినా ఫలితం లేదు.
చివరికి అక్కడున్న తోటివారి సలహా మేరకు డ్రైవర్‌కు రూ. 1,600 చెల్లించాడు. తన ఫిర్యాదుకు ఓలా నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంపై అనురాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెంగళూరు మొత్తం తిరిగినా ఇంత ఖర్చు కాదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని, రైడ్ వివరాల స్క్రీన్‌షాట్‌లను తీసుకొని, ఏదైనా తేడా వస్తే కస్టమర్ సపోర్ట్ టీమ్‌లకు రిపోర్ట్ చేయాలని నెటిజన్లు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment