
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని కాపవరం గ్రామస్తులు అడ్డుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు పథకంలో వేలకోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. చెరువులో పడి ముగ్గురు చనిపోయినా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పరామర్శించేందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను పరిశీలించడమేంటని గ్రామస్తులు ఆయనను నిలదీశారు. కాపవరంలో పేదలకు ఇచ్చే స్థలాల మీద నిరాధార ఆరోపణలు చేస్తున్న రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలంటూ వారంతా కారు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
(చదవండి: ఈఎస్‌ఐ స్కామ్‌లో ముగిసిన ఏసీబీ విచారణ)
Comments
Please login to add a commentAdd a comment