nallamilli ramakrishna reddy
-
అనపర్తిలో అయోమయం
సాక్షి, రాజమహేంద్రవరం: అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి వ్యవహారం రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ముగింపు దశకు చేరుకుంటున్నా ఎన్నికల బరిలోకి ఎవరు దిగుతారనే విషయంపై సస్పెన్స్ వీడటం లేదు. ఫలితంగా బీజేపీ, టీడీపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సీటు తమకంటే తమకంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామం ఆయా పార్టీల శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి స్వప్రయోజనాల కోసం, మరిది చంద్రబాబుకు మంచి చేసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాల్లో టీడీపీ, బీజేపీ నేతలు నలిగిపోతున్నారు. చంద్రబాబు వ్యూహంతో.. అనపర్తి అభ్యరి్థగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును టీడీపీ తొలుత ప్రకటించింది. అనంతరం కుదిరిన పొత్తుల్లో ఈ సీటును బీజేపీకి వదిలేసింది. దీంతో హతాశులైన నల్లమిల్లి వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. చంద్రబాబు దిగి రాకపోవడంతో రామకృష్ణారెడ్డి రెబల్‌గా బరిలోకి దిగి, ప్రచారం చేసుకుంటున్నారు. ఈలోగా ఇక్కడ బీజేపీ అభ్యరి్థగా మాజీ సైనికుడు ములగపాటి శివరామ కృష్ణంరాజు పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన విపక్ష కూటమి అభ్యరి్థగా బీజేపీతో పాటు టీడీపీ, జనసేన కండువాలు వేసుకుని ప్రచారం చేసుకుంటూంటే టీడీపీ నేతలు బిక్కవోలులో అడ్డుకున్నారు. టీడీపీ కండువాలతో ప్రచారం చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఇదిలా ఉండగా.. తదనంతర పరిణామాల్లో చంద్రబాబు వ్యూహం మేరకు బీజేపీ అభ్యరి్థగా శివరామ కృష్ణంరాజును తప్పించి, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కమలం పార్టీ అధికారిక అభ్యర్థిగా ప్రకటించేందుకు పురందేశ్వరి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్ ఏర్పడింది. దీనిపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. పోటాపోటీగా నామినేషన్లు నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తరువాత చూద్దాంలే అనే భావనతో ఎవరికి వారు ఇప్పటికే నామినేషన్లు వేస్తున్నారు. తొలుత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భార్య మహాలక్ష్మి టీడీపీ తరఫున ఒక సెట్ నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి తానే ఎన్నికల బరిలోకి దిగుతానని సంకేతాలు ఇచ్చేలా ఆ పార్టీ అభ్యర్థి శివరామ కృష్ణంరాజు తరఫున ఆయన భార్య దుర్గా దేవిక నామినేషన్ దాఖలు చేసి అందరినీ షాక్‌కు గురి చేశారు. ఒకవైపు సీటుపై నెలకొన్న పీటముడి వీడకముందే బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు కావడంతో దీనిని బీజేపీకే కట్టబెడతారేమోననే ఆందోళనతో నల్లమిల్లి వర్గం పునరాలోచనలో పడింది. ముందు జాగ్రత్తగా రామకృష్ణారెడ్డి తరఫున తేతలి అబ్బుస్రెడ్డి కూడా బీజేపీ అభ్యరి్థగా మంగళవారం నామినేషన్ వేశారు. ఈ పరిణామం బీజేపీ నేతల్లో మరింతగా అగ్గి రాజేస్తోంది. పారీ్టలో చేరకుండానే బీజేపీ అభ్యరి్థగా ఎలా నామినేషన్ వేస్తారంటూ కమలనాథులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పురందేశ్వరి మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ గూటికి నల్లమిల్లి? తాజా పరిణామాల్లో అనపర్తిలో సరికొత్త రాజకీయానికి తెర లేస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి వ్యూహాత్మకంగా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కమలం గూటికి చేరుకోనున్నారు. పార్టీ తీర్థం పుచ్చుకునే ప్రక్రియ లాంఛనమన్న సంకేతాలు టీడీపీ నేతల నుంచే వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చంద్రబాబు, పురందేశ్వరి డైరెక్షన్లోనే ఈ వ్యవహారం జరుగుతున్నట్లు కమలనాథులే చెబుతున్నారు. కమలం గుర్తు పైనే అనపర్తి బరిలో నల్లమిల్లి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయన బీజేపీ అభ్యర్థిగా తన తరఫున వేరే వ్యక్తితో నామినేషన్ వేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ బీఫామ్ సైతం తనకే దక్కుతుందన్న ధీమా నల్లమిల్లిలో కనిపిస్తోంది. సెంటిమెంటుతోనేనా.. అనపర్తిపై పురందేశ్వరి ఇంతగా పట్టు పట్టడానికి ఈ నియోజకవర్గ సెంటిమెంటే కారణమని చెబుతున్నారు. అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలని భావిస్తే.. ఏక మొత్తంగా అదే పార్టీకి పట్టం కడతారు. ఆ పారీ్టకి భారీ మెజార్టీ అందిస్తారన్న ఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏ పారీ్టకి మొగ్గు చూపినా 50 వేలకు పైగా మెజార్టీ ఇచ్చేస్తారు. గత ఎన్నికల గణాంకాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2009లో రాజమండ్రి నుంచి టీడీపీ ఎంపీ అభ్యరి్థగా మురళీమోహన్ పోటీ చేశారు. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు 50 వేల మెజార్టీ దక్కింది. కేవలం అనపర్తిలో మాత్రమే భంగపాటు ఎదురైంది. ఆ ఎన్నికల్లో అనపర్తి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు ఒక్క ఈ నియోజకవర్గం నుంచే 60 వేల ఓట్ల మెజార్టీ లభించింది. అనపర్తి దెబ్బకు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ పరిణామం పునరావృతం కాకుండా, తాను గెలవాలంటే నల్లమిల్లిని బీజేపీ నుంచి పోటీ చేయించాలన్నది చిన్నమ్మ ఆకాంక్ష. అందుకోసమే తీవ్ర విమర్శలు వస్తున్నా లెక్క చేయకుండా పురందేశ్వరి అభ్యర్థి మార్పుపై పట్టుబడుతున్నారని అంటున్నారు. నల్లమిల్లికే చిన్నమ్మ ఆశీస్సులు! రాజమండ్రి ఎంపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న చిన్న మ్మ పురందేశ్వరి.. తన ప్రయోజనాల కోసం, మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు మేలు కోసం సొంత పారీ్టకి నమ్మకద్రోహం చేసేందుకు సైతం వెనుకాడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. బీజే పీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి కృష్ణంరాజును కాదని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి ఆమె అండగా నిలుస్తున్నారని చెబుతున్నారు. ఎలాగైనా నల్లమిల్లిని బీజేపీ నుంచి అనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ఆమె తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ సైనికుడు, కృష్ణంరాజును పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆమె అలి్టమేటం జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షురాలి ఆదేశాలను పట్టించుకోని కృష్ణంరాజు తన భార్యతో నామినేషన్ దాఖలు చేయించారని తెలిసింది. మాజీ సైనికుడికి అన్యాయం? అనపర్తి అసెంబ్లీ అభ్యరి్థగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణంరాజు ఆ పారీ్టకి వీర విధేయుడు. ఆయనది ఆర్ఎస్ఎస్ కుటుంబం. తండ్రి బీజేపీ బలోపేతానికి పాటు పడ్డారు. తన తండ్రి వైద్యం కోసం ఆర్మీ నుంచి వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన కృష్ణంరాజు బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా పేరు సంపాదించారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు నాలుగేళ్లుగా అహరి్నశలూ కష్టపడ్డారు. ఏడాది నుంచి బీజేపీ అనపర్తి నియోజకవర్గ కనీ్వనర్‌గా కొనసాగుతున్నారు. ఈ మాజీ సైనికుడిని గుర్తించిన బీజేపీ కేంద్ర పెద్దలు అనపర్తి సీటు కేటాయించారు. ఈ పరిణామం పురందేశ్వరికి మింగుడు పడని అంశంగా మారింది. స్వపక్ష అభ్యరి్థకి మద్దతు ఇవ్వాల్సింది పోయి.. చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి అండగా నిలవడం ప్రారంభించారు. అనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో లోక్‌సభ ఓట్లు తనకు రావాలంటే అక్కడ ఎమ్మెల్యే అభ్యరి్థగా నల్లమిల్లి ఉండాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ సీటు ఇప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం చివరకు అధిష్టాన నిర్ణయాన్ని సైతం ధిక్కరించేందుకు సిద్ధపడుతున్నారు. పురందేశ్వరి వ్యవహార శైలి కమలనాథులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత సోము వీర్రాజు బీజేపీకి దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. -
ఆడా నేనే.. ఈడా నేనే.. కూటమిలో మరో హైడ్రామా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి కట్టిన పార్టీల నడుమ మంగళవారం రాత్రి మరో హైడ్రా మా నడిచింది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటా యించిన అనపర్తి నియోజకవర్గ నుంచి కూడా టీడీపీ నేతనే రంగంలోకి దింపేందుకు నాయకుడి మార్పు డ్రామా పూర్తయ్యింది. రెండు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగుస్తున్న సమయంలో అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీకి కేటాయించిన అనపర్తి నియోజకవర్గం నుంచి మాజీ సైనికుడైన శివకృష్ణంరాజు పేరును పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలో ఉంది. ఆ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి నుంచి బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించిన అభ్యర్థి కంటే ప్రస్తుత టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తేనే ప్రయోజనం ఉంటుందనేలా కొంతకాలంగా పురందేశ్వరి రాజకీయాలు నెరుపుతున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించిన అభ్యర్థి శివకృష్ణంరాజును ప్రచారం చేసుకోనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుపడుతూ వచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ శివకృష్ణంరాజు సోమవారం బీజేపీ తరఫున నామినేషన్ కూడా దాఖలు చేశారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన తరువాత కూడా టీడీపీ నేతను బీజేపీలో చేర్పించి.. ఆ పార్టీకి, పొత్తు ధర్మానికి వెన్నుపోటు పొడిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక పునరావాసం కోసం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులే బీజేపీకి కేటాయించిన సీట్లలోనూ పోటీ చేస్తున్నారు. తొలి నుంచి బీజేపీలో రాజకీయాలు కొనసాగించిన నాయకులకు బీజేపీ మొండిచేయి చూపడంతో ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నారు. మా అభ్యర్థి ఆయనే: పురందేశ్వరి కాగా.. టీడీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రాత్రి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ ఎన్నికల ఇన్చార్జి అరుణ్‌సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. -
నమ్మక ద్రోహం.. సైకిల్ దహనం
ఇటీవల ఓ సభలో కుర్చీలు మడతబెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపును తెలుగు తమ్ముళ్లు ఏ విధంగా అర్థం చేసుకున్నారో గానీ.. ఆయన తీరుపై రగిలిపోయి పార్టీ ఎన్నికల గుర్తయిన సైకిల్‌నే మడతపెట్టి తగలెట్టేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘పచ్చ’దండు అధిష్టానం తీరుపై దండెత్తుతోంది. టికెట్ల కేటాయింపుపై మండిపడుతోంది. చంద్రబాబు నమ్మించి మోసం చేస్తున్నారని ఆశావహులు రెబల్స్‌గా మారుతున్నారు. ఇండిపెండెంట్లుగా పోటీకి సిద్ధమవుతున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం/పెనుగంచిప్రోలు/సాక్షి ప్రతినిధి, కడప/సాక్షి, అమరావతి/అరకు: అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించడాన్ని టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోయాయి. ఆగ్రహంతో ఊగిపోయాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి జరిగిన ద్రోహానికి కార్యకర్తలు భగ్గుమన్నారు. నల్లమిల్లి స్వగ్రామం రామవరంలో గురువారం పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. టీడీపీ కరపత్రాలు, పార్టీ జెండాలు కుప్పగా పోసి తగులబెట్టారు. అందులో సైకిల్‌ను వేసి దహనంచేశారు. ఇంటిపైకి వెళ్లి దూకేందుకు ఓ కార్యకర్త ప్రయత్నించాడు. చంద్రబాబుకు, టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లమిల్లికి టికెట్ ఇచ్చే వరకూ వెనక్కు తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. కట్టప్ప రాజకీయాలు మానుకోవాలని బాబును హెచ్చరించారు. దీంతో రామవరం గ్రామం అట్టుడికింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి భావోద్వేగానికి గురయ్యారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంతో ఆడుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ కోసం ఐదేళ్ల పాటు తన ప్రాణాన్ని, కుటుంబాన్ని పణంగా పెట్టానని ఆవేదన చెందారు. కార్యకర్తల అభీష్టం మేరకు భవిష్యత్తు నిర్ణయం ప్రకటిస్తానన్నారు. తాను, తన కుటుంబం ఐదురోజులపాటు నియోజకవర్గంలో పర్యటిస్తామని, ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని ఎన్నికల్లో పోటీపై తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. నల్లమిల్లి టీడీపీ రెబల్‌గా బరిలోకిదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనపర్తి సీటును బీజేపీకి కేటాయిస్తారని మూడురోజులుగా ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి నల్లమిల్లి వర్గం ఆందోళన చెందుతోంది. నిరసన వ్యక్తం చేస్తోంది. బీజేపీ బుధవారం అభ్యర్థిని ప్రకటించగానే ఒక్కసారిగా నల్లమిల్లి అనుచరులు రగిలిపోయారు. ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే ఏ పార్టీ అయినా పొత్తు ధర్మాన్ని పాటించాలని బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణం రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కలిసి సహకరించాలని కోరతానని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ పెద్దల నిర్ణయం మేరకు ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ♦ వై నాట్ పులివెందుల అంటూ ప్రగల్బాలు పలికే చంద్రబాబుకు వైఎస్సార్ జిల్లా కడప లోక్‌సభ స్థానంలో పోటీకి అభ్యర్థి దొరకడం లేదు. దీంతో రకరకాల పేర్లతో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతోంది. తాజాగా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేరుతో గురువారం ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టింది. ఈ సీటులో పోటీకి ఇప్పటికే ఐదుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి ఈ స్థానానికి అభ్యర్థిగా ఏడాది క్రితమే ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులరెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. శ్రీనివాసులురెడ్డి పోటీకి విముఖత చూపడంతో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, జమ్మలమడుగు, బద్వేల్ ఇన్చార్జిలు భూపేష్‌రెడ్డి, రితీష్‌రెడ్డి పేర్లతోనూ టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టింది. ఓదశలో వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పేరూ వినిపించింది. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోటీచేస్తారని వార్తలు వచ్చాక సౌభాగ్యమ్మ పేరు కనుమరుగైంది. తాజాగా ఆరోవ్యక్తిగా గండ్లూరు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేరును టీడీపీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈయన ప్రొద్దుటూరు అసెంబ్లీ సీటును ఆశించి భంగపడ్డారు. దీంతో ప్రవీణ్‌ను కడప లోక్ సభ నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ♦ రాష్ట్ర బీజేపీలో అభ్యర్థులనూ చంద్రబాబు నిర్ణయిస్తున్నారంటూ బద్వేల్ బీజేపీ సీనియర్ నాయకుడు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాల ద్వారా ప్రజల్లోంచి వచ్చిన తనలాంటి దళిత నాయకులకు అన్యాయం చేస్తూ టీడీపీకి చెందిన రోశన్నకు టికెట్ ఇవ్వడంపై మండిపడ్డారు. బీజేపీ నాయకత్వం ఇకనైనా పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు గుర్తింపు ఇవ్వాలంటూ గురువారం విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఫ్లకార్డులతో నిరసనకు దిగారు. 20ఏళ్లపాటు పార్టీకి సేవ చేసిన తనలాంటి యువకుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని కోరారు. చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియని ఆయన కుమారుడు లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా గెలవకుండానే పదవులు అనుభవించారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తీరుపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. పెనుగంచిప్రోలు మండలం మునేరు అవతల నూతలపాటి కన్వెన్షన్‌లో గురువారం టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి, ఓ చానల్ ఎండీ బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి తాతయ్య మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను వైఎస్సార్ సీపీ నుంచి వచ్చానని చెబుతున్నారని, తాతయ్య కాంగ్రెస్‌లో నుంచే టీడీపీలోకి వచ్చిన సంగతి మరచిపోతే ఎలా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం భారీగా ఖర్చుచేశానని, అందుకే సీటు ఆశించానని పేర్కొన్నారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానని తాతయ్య ఆరోపించడం అసంబద్ధమని, ఆయన మీడియా ముఖంగా క్షమాపణ కోరాలని, లేకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సత్తా చాటుతానని వెల్లడించారు. -
అనపర్తిలో ఆగ్రహ జ్వాల! స్పందించని బాబు తీరు..
తూర్పుగోదావరి: నోటి దగ్గర కూడు లాగేసుకుంటే ఎలా ఉంటుంది? చిన్న పిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసేసుకుంటే వారికి ఎంత కోపం వస్తుంది? సరిగ్గా అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో అనపర్తి నుంచి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ఆరంభించారు. తదనంతర పరిణామాల్లో టీడీపీ, జనసేనకు బీజేపీతో పొత్తు కుదిరింది. చంద్రబాబు వెళ్లి బీజేపీ నేతలతో బేరసారాలు సాగించడమే కాకుండా.. వారడిగిన స్థాయిలో సీట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అనపర్తి సీటును బీజేపీకి సమర్పించుకున్నారు. దీంతో తాజాగా ఇక్కడి నుంచి విపక్ష కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన ములగపాటి శివరామకృష్ణంరాజు పేరు ప్రకటించారు. కనీసం రామకృష్ణారెడ్డికి మాటమాత్రంగా కూడా ఈ విషయం చెప్పలేదు. ఈ పరిణామాలు అనపర్తి టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. రామకృష్ణారెడ్డికి ఇచ్చినట్టే ఇచ్చి టికెట్టు లాగేసుకోవడంతో వారు భగ్గుమంటున్నారు. నాలుగు రోజులుగా రచ్చ వాస్తవానికి అనపర్తి టికెట్టుపై నియోజకవర్గ టీడీపీలో నాలుగు రోజులుగా రచ్చ జరుగుతోంది. ఈ సీటును బీజేపీకి కేటాయిస్తున్నారంటూ వార్తలు రావడంతో కొద్ది రోజులుగా టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. దీనిపై అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకూ ఎన్నికల ప్రచారం చేయవద్దంటూ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను వారు అడ్డుకున్నారు. తొలిగా బిక్కవోలు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రామకృష్ణారెడ్డిని ప్రచారం చేయవద్దంటూ నిలిపివేశారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులకు రాజీనామాలు చేస్తూ సోమవారం రాజమహేంద్రవరంలో ఉన్న టీడీపీ జోన్–2 కో ఆర్డినేటర్ రావు వెంకట సుజయ కృష్ణ రంగారావుకు లేఖలు అందజేశారు. అలాగే మంగళవారం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ధర్నా చేశారు. బుధవారం పెదపూడిలో నిరసన చేపట్టారు. అదే రోజు సాయంత్రం బీజేపీ అభ్యర్థిగా శివరామ కృష్ణంరాజు పేరు ప్రకటించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అదే రోజు రాత్రి ఇద్దరు యువకులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు. ఈ క్రమంలో రామవరంలోని ఆయన నివాసానికి టీడీపీ శ్రేణులు గురువారం పెద్ద ఎత్తున చేరుకున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికై నా టీడీపీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసి, రామకృష్ణారెడ్డికే టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నలభై సంవత్సరాలుగా నియోజకవర్గంలో టీడీపీని మోస్తున్న నల్లమిల్లి కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కట్టప్ప రాజకీయాలు చేయద్దంటూ చంద్రబాబును తీవ్రంగా దూషించారు. టీడీపీ ఎన్నికల ప్రచార కరపత్రాలు, పార్టీ జెండాలను కుప్పగా పోసి తగులబెట్టారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు. నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇన్నాళ్లూ తాను పడిన కష్టం నిష్ప్రయోజనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తిరిగి ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు తగు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇంత తంతు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు కానీ, ఇతర పెద్దలు కానీ స్పందించకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలపండి అనపర్తి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి దిగజారుడు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం కేటాయించకపోతే ఆ పార్టీ శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలే తప్ప, రామవరంలో చేస్తే ఉపయోగమేమిటని, ఇది హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విలేకర్లతో మాట్లాడుతున్న ఏఎంసీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి పొత్తుల్లో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే సీటు బీజేపీకి కేటాయించడం ఆయా పార్టీల అంతర్గత వ్యవహారమని, చంద్రబాబు నిర్ణయమని అన్నారు. తనకు టికెట్టు రాకుండా స్థానిక వైఎస్సార్ సీపీ కుట్రలు చేస్తోందని రామకృష్ణారెడ్డి ఆరోపించడం.. ఆడలేక మద్దెల ఓడు సామెతను గుర్తు చేస్తోందని విమర్శించారు. రాజకీయంగా తనకు తగిలే ఎదురు దెబ్బను వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఆపాదించడం రామకృష్ణారెడ్డికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. తనకు టికెట్టు రాకుండా వైఎస్సార్ సీపీ నేతలు రూ.20 కోట్లకు బేరసారాలు నడిపారంటూ ఆయన పేర్కొనడం విడ్డూరంగా ఉందని, ఎవరైనా అధిక మొత్తంలో నగదు ముట్టజెపితే అమ్ముడుపోయే స్థితిలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారా అని కృష్ణారెడ్డి ప్రశ్నించారు. మూడేళ్ల కిందట బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో చేసిన అసత్య ప్రమాణం, ఇటీవల అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారికి సంబంధించి అవహేళనగా మాట్లాడిన ఫలితమే నేడు రామకృష్ణారెడ్డికి పట్టిన దుస్థితి అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని కర్మఫలాలు అనుభవించక తప్పదని కృష్ణారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ వారా కుమారి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చిర్ల వీర రాఘవరెడ్డి కూడా పాల్గొన్నారు. ఇవి చదవండి: బాబు పొత్తు ధర్మం చిత్తు చిత్తు? -
‘బాబు నన్ను మోసం చేశారు..’ ఏడ్చేసిన నల్లమిల్లి
సాక్షి, తూర్పు గోదావరి: కూటమిలో చిచ్చుతో అనపర్తి రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. టీడీపీ కరపత్రాలను, జెండాలను కుప్పలుగా తగలబోసి అందులో ఓ సైకిల్‌ను వేసి కాల్చేశారు. అధిష్టాన నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి గురైన నల్లమిల్లి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ‘‘నాకు టికెట్ రాకుండా పెద్ద కుట్ర చేశారు. నాకు జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తా’’ అంటూ గురువారం ఉదయం అనుచరులతో జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టకున్నారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో ప్రజల్లోకి వెళ్తానన్న ఆయన.. ప్రజల నిర్ణయం మేరకు పోటీ చేస్తానని ప్రకటించారు. ‘‘నేను టీడీపీకి మద్దతివ్వను. బీజేపీకి కూడా ఓటు వేయమని చెప్పను. చంద్రబాబు నన్ను నమ్మించి మోసం చేశారు. నా నియోజకవర్గంలో ఏ మాత్రం బలం లేని బీజేపీకి ఎలా సీటు కేటాయిస్తారు?.. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చేది లేదు’’ అంటూ స్పష్టం చేశారాయన. టీడీపీ తరఫున అనపర్తి టికెట్‌ను ఈ మాజీ ఎమ్మెల్యే ఆశించారు. అయితే తనతో సంప్రదింపులేం జరపకుండా అధినేత చంద్రబాబు పొత్తులో భాగంగా ఆ సీటును చంద్రబాబు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించారు. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా ఎం. శివకృష్ణంరాజు పేరును బీజేపీ బుధవారం సాయంత్రం నాటి జాబితాలో అధికారికంగా ప్రకటించింది. దీంతో.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతకు ముందు.. అనపర్తిలో నల్లమిల్లి అనుచరుల ఆగ్రహావేశాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనపర్తి సీటు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారంటూ నల్లమిల్లి అనుచరుల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. మంట్లలో సైకిల్‌ను టీడీపీ కరపత్రాలను తగలబెట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం తన నివాసంలో అనుచరులతో భేటీ అయిన రామకృష్ణారెడ్డి.. చివరకు రెబల్‌గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే అవినీతి బాగోతం: నిగ్గు తేలుతున్న నిజాలు
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: చేసిన పాపం ఊరకనే పోదంటారు పెద్దలు. అది రాజకీయాల్లో అయితే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విషయంలో అక్షర సత్యమైంది. అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా వ్యవహరించిన ఈయన అవినీతి గుట్టు రట్టవుతోంది. ఐదేళ్ల ఏలుబడిలో సాగించిన అక్రమాల పుట్ట విజిలెన్స్ చేతికి చిక్కింది. విజిలెన్స్ విచారణలో వాస్తవాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. నీరు–చెట్టు, బ్రాందీషాపులు, ధాన్యం కొనుగోలులో హమాలీల ముసుగు, లే అవుట్ల అనుమతులు, ప్రభుత్వ సబ్సిడీ రుణాలలో ముందస్తు కమీషన్ల కక్కుర్తి...ఇలా ఒకటేంటి.. విజిలెన్స్ విచారణలో ఎన్నింటిలోనో అవినీతి దర్శనమిస్తున్నట్లు భోగట్టా. విచారణాంశాల్లో కొన్ని.. ►నీరు–చెట్టు పథకంలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వేసి గ్రావెల్, మట్టిని తెగనమ్మేసిన విషయం విజిలెన్స్ విచారణలో ప్రా«థమికంగా తేలిందని సమాచారం. గ్రావెల్‌ను లేఔట్లకు, మట్టిని ఆలమూరు మండలం జొన్నాడ, ఆలమూరు, రాయవరం మండలం సోమేశ్వరం, రాయవరం, అనపర్తి మండలం పొలమూరుతోపాటు జిల్లాలో పలు ప్రాంతాలలో ఇటుకబట్టీలకు అమ్మేశారని నిర్థారణకు వచ్చారు. చెరువులలో అపరిమితమైన లోతు తవ్వేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ►నీరు–చెట్టు ద్వారా 2016నుంచి 2018 వరకూ సుమారు రూ.3 కోట్లతో 51 పనులు చేపట్టారు. ఇందుకు 10 రెట్లు అంటే సుమారు రూ.30 కోట్లు అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా తేల్చారని సమాచారం. బిక్కవోలు మండలం లింగాల చెరువు పనుల్లో భారీగానే సొమ్ము చేసుకున్నారని తెలిసింది. ►రంగంపేట మండల కేంద్రంతో పాటు వెంకటాపురం, వడిశలేరు, సింగంపల్లి గ్రామాల్లో అవినీతి చోటు చేసుకుందని గుర్తించారు. రంగాపురంలో అచ్చన్న చెరువు, తమ్మలపల్లిలో రాళ్ల కండ్రిగ చెరువుల తవ్వకాల్లో దోచుకున్నారని నిఘా విభాగం ఆధారాలు సేకరించింది. ►మాజీ ఎమ్మెల్యే బ్రాందీ షాపులనూ విడిచిపెట్ట లేదు. మందుబాబులపై ఎన్.ఆర్.టాక్సు పేరుతో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 అదనంగా యజమానులు వసూలుకు తలుపులు బార్లా తెరిచారు. 40 షాపుల నుంచి కమీషన్లు కొట్టేశారనే అంశంపై విజిలెన్స్ లోతుగా విచారిస్తోంది. ఏటా రూ.80 లక్షలు వసూలు చేసిన వైనంపై ఆరా తీస్తోంది.. రామవరం, పొలమూరులకు చెందిన ముఖ్య అనుచరులు ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారని సమాచారం. ►ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలులో హమాలీల పేరుతో రూ. లక్షలు కాజేశారు. ఈ మొత్తాన్ని మధ్యవర్తుల ద్వారా వెనకేసుకున్నారని తేలింది. కొమరిపాలెంలో జరిగిన కొనుగోలులో 10 శాతం కమీషన్ రూపంలో వెనకేసుకున్నారు. సొసైటీ ప్రతినిధి రెండు విడతల్లో రూ.20 లక్షలు అనపర్తి మండలం పొలమూరుకు చెందిన ముఖ్య అనుచరుడి ద్వారా కమీషన్‌గా రాబట్టడంపై విజిలెన్స్ దృష్టి సారించింది. ►అనధికార లేఔట్లు, ల్యాండ్ కన్వర్షన్‌కు అనుమతులు మంజూరు చేయాలంటే ముందుగా లేఔట్ యజమాని ఎకరాకు రూ.2 లక్షలు ముట్టజెప్సాలిందే. అనపర్తికి చెందిన సత్తి వెంకటరామారెడ్డి ల్యాండ్ కన్వర్షన్ కోసం టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు ఎస్డీఆర్ ద్వారా ఎకరాకు రూ.2 లక్షలు వంతున వసూలు చేశారు. ఊలపల్లిలో రెండెకరాల లేఔట్ అనుమతికి జి.మామిడాడకు చెందిన సూర్యనారాయణరెడ్డి దరఖాస్తు చేసుకుంటే ఎకరాకు రూ.2.50 లక్షలు ఇవ్వాలని టిఎస్సార్ అనే ముఖ్య అనుచరుడు మధ్యవర్తిత్వం వహించారు. చివరకు రూ.5 లక్షలు చేతిలో పడ్డాకనే అనుమతించినట్టు విజిలెన్స్ గుర్తించింది. ►బిక్కవోలు మండలం పందలపాకకు చెందిన రామారెడ్డి 2017లో వరికోత మెషీన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. రూ.2.50 లక్షలు ఇస్తేనే మెషీన్ మంజూరవుతుందని టీడీపీ నాయకుడు విజయభాస్కరరెడ్డి బేరం పెట్టారు. ధాన్యం అమ్మగా వచ్చిన రూ.2.50 లక్షలు ముట్టజెప్పినా కోత మెషీన్ మంజూరు కాలేదు. సరికదా ఇప్పటికీ ఆ సొమ్ము తిరిగి చెల్లించకపోవడం గమనార్హం. ఇలాంటి బాగోతాలన్నీ విజిలెన్స్ నిశిత పరిశీలనలో తేలాల్సి ఉంది. విచారణ జరుగుతోంది ఫిర్యాదులపై మా టీమ్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే నాలుగైదు రోజులుగా క్షేత్ర స్థాయిలో విచారించారు. బిక్కవోలు, అనపర్తి మండలాల్లో వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. విచారణ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. ఒక డీఎస్పీ, ఇద్దరు ఇనస్పెక్టర్లు, ముగ్గురు వివిధ విభాగాల అధికారులు, మొత్తంగా ఏడుగురు సభ్యులతో కూడిన బృందం వేగవంతంగా విచారిస్తోంది – విజిలెన్స్ ఎస్పీ రవిప్రకాష్ ఇవీ చదవండి: తాలిబన్ల ‘కే’ తలనొప్పి కరువు సీమలో.. ‘కొప్పర్తి’ కాంతులు -
సెంట్రల్ జైలుకు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
సాక్షి, కంబాలచెరువు: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బుధవారం సెంట్రల్ జైలుకు తరలించారు. సొంత బావ హత్యకు కారకుడిగా భావిస్తూ ఆయనను అరెస్టు చేసిన పోలీసులు తొలుత కాకినాడ సజ్ జైలుకు తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఆయనకు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కాకినాడ మేయర్ సుంకర పావని, జ్యోతుల నవీన్, కాశీ నవీన్, ఆళ్ల గోవింద్ జైలు వద్దకు ముందుగా చేరుకున్నారు. -
హత్యకేసు: అనపర్తి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
సాక్షి, తూర్పుగోదావరి : అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హత్య కేసుకు సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల కిత్రం నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బావ వరుస అయిన సత్తిరాజు రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ హత్య కేసులో రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ సత్తిరాజురెడ్డి సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరిపి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం రామకృష్ణారెడ్డిని కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని కాకినాడ సబ్‌జైలుకు తరలించారు. -
అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
-
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిరసన
సాక్షి, అనపర్తి: టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఒక్క సెంటు భూమిని కూడా గ్రామంలో మంజూరు చేయని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రస్తుతం గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం సేకరించిన భూమిపై మాట్లాడే అర్హతలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలోని మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్న నియోజవకర్గంలోని పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఆయన ఇంటి ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే.. ► పేదలకు పంపిణీ చేసేందుకు సేకరించిన భూమి నివాసానికి అనువైనది కాదని, దీనిని లబ్ధిదారులు సైతం వ్యతిరేకిస్తున్నారంటూ రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇవ్వాలి. ►టీడీపీ హయాంలో రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేదలకు సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదు. ►వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణ జరిపి ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు చేపట్టడంపట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. కాగా, విషయం తెలుసుకుని రామవరం చేరుకున్న రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి ఆందోళనకారులతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో నిరసన కార్యక్రమాన్ని విరమించాలని కోరడంతో మహిళలు అందుకు సహకరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని కాపవరం గ్రామస్తులు అడ్డుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు పథకంలో వేలకోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. చెరువులో పడి ముగ్గురు చనిపోయినా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పరామర్శించేందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను పరిశీలించడమేంటని గ్రామస్తులు ఆయనను నిలదీశారు. కాపవరంలో పేదలకు ఇచ్చే స్థలాల మీద నిరాధార ఆరోపణలు చేస్తున్న రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలంటూ వారంతా కారు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. (చదవండి: ఈఎస్ఐ స్కామ్‌లో ముగిసిన ఏసీబీ విచారణ) -
కర్రలతో దాడిచేసుకున్న టీడీపీ నేతలు
సాక్షి, అనపర్తి/తూర్పు గోదావరి : మండలంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. వివాహేతర సంబంధం వ్యవహారంపై కొప్పవరంలో టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ నేతలు వెంకట్రామిరెడ్డి, సర్రెడ్డి వర్గీయులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. వివాహేతర సంబంధంలో సెటిల్మెంట్ బెడిసికొట్టడంతో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంపీటీసీ సర్రెడ్డికి గాయలయ్యాయి. దీంతో వెంకట్రామిరెడ్డి ఇంటిపై సర్రెడ్డి వర్గీయులు దాడికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో టీడీపీ మండలాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తలకు గాయమైంది. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఘర్షణలు చెలరేగకుండా గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడానికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగినట్టు సమాచారం. -
కర్రలతో దాడిచేసుకున్న టీడీపీ నేతలు
-
నల్లమిల్లి... అంతా కల్లబొల్లి
అనపర్తి/బిక్కవోలు/పెదపూడి: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కల్లబొల్లి మాటలపై నమ్మకం లేని వారంతా ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతుండడంతో ఆ పార్టీలో ఆందోళన ప్రారంభమైంది. అడుగడుగునా అవినీతి కార్యక్రమాలతో ఆయన అనుచరులు చెలరేగిపోతున్న తీరుకు విసుగుచెందిన పలువురు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. వీరంతా ప్రత్యామ్నాయంగా వైఎస్సార్ సీపీ వైపు అడుగులు వేయడంతో నియోజకవర్గ ముఖచిత్రం మారిపోతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. టీడీపీకి చెందిన పెదపూడి–1 ఎంపీటీసీ సభ్యురాలు గుణ్ణం వనిత ఎమ్మెల్యే అవినీతిపై గతంలో గళం విప్పిన విషయం విదితమే. నియోజకవర్గంలోని పెదపూడి, ఏపీత్రయం, పైన, వెంకటాపురం, నల్లమిల్లి, పెదరాయవరం, మర్రిపూడి తదితర గ్రామాల్లో ఆయన అనుచరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో భారీగా చేరారు. రంగంపేట మండలంలో టీడీపీకి చెందిన రిమ్మలపూడి వెంకటేశ్వరరావు వైఎస్సార్సీపీలోకి మొదటిగా చేరారు. అనంతరం రంగంపేట మండలం టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు మంగిన రాంబాబు పార్టీలో చేరారు. త్వరలో పెదపూడి1 ఎంపీటీసీ సభ్యురాలు గుణ్ణం వనిత చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో టీడీపీకి కంచుకోటగా నిలిచే ఒక బలమైన సామాజికవర్గం వైఎస్సార్సీపీలో చేరడానికి ముందడుగు వేస్తుండడంతో టీడీపీ పునాదులకు బీటలు వారనున్నాయి. అనపర్తిలో బలమైన సామాజికవర్గ ప్రతినిధి చాలా కాలంగా ఎమ్మెల్యేకు దూరం ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ఎమ్మెల్యేకు మధ్య అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరాయి. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వచ్చింది. దీనికితోడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలేవీ అమలు కాకపోవడంతో ప్రజల్లో చోటుచేసుకున్న అసంతృప్తి ఆ పార్టీని పూర్తిగా ముంచేస్తుందన్న భయంతో అరకొరగా ఉండే నేతలు కూడా దూరంగా ఉండడంతో ఎమ్మెల్యే వర్గంలో కలకలం రేపుతోంది. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ బుధవారం నుంచి అనపర్తి నియోజకవర్గంలో ప్రారంభించనున్న పాదయాత్రలో చేరికలు వరుస కట్టనున్నాయని ఆ పార్టీలోని వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు. అన్నింటా అవినీతి చెద... రంగంపేట, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాల్లో ‘నీరు చెట్టు’ పథకంలో మట్టిని అక్రమంగా అమ్ముకుని కాసులు పోగేసుకున్నారనే అరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని ఒక్కో బ్రాందీ షాపు నుంచి సుమారు రూ.2 లక్షలు వరకు మామూళ్లు ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తీసుకుంటున్నట్టు, ధాన్యం కోనుకోగలు కేంద్రాల నుంచి కూడా బస్తాకు సుమారు రూ.40 వరకు కమీషన్‌గా అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. -
తెలుగు తమ్ముళ్ల ఢీ అంటే ఢీ
పెదపూడి (అనపర్తి): పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామ సభలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు వర్గాల మధ్య గలాటా చోటు చేసుకుంది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న సామాజిక భవనంలో జన్మభూమి మా ఊరు గ్రామ సభ శుక్రవారం నిర్వహించారు. సభకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఇదే గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు హాజరయ్యారు. సభలో భాస్కరరామారావు మాట్లాడుతూ గతంలో గ్రామంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించినప్పుడు ‘ఒక సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు.. 40 ఏళ్లు వివిధ పదవులు చేపట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ’ ఎందుకు విమర్శించారంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని నిలదీశారు. అప్పటికే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ వర్గీయులతో పాటు పోలీసు బలగాలు కూడా భారీగా మోహరించి ఉన్నాయి. భాస్కరరామారావు లేవనెత్తిన అంశాన్ని పట్టించుకోకుండా ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలపై మాట్లాడుతుండగా స్థానికుడు లేచి భాస్కరరామారావు అడిగిన దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు అభివృద్ధి పనులపై మాట్లాడిన అనంతరం సమాధానం చెబుతారని చెప్పడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని గందరగోళానికి దారి తీసింది. వెంటనే కొంతమంది బొడ్డు భాస్కరరామారావును మీ విషయం ఎమ్మెల్యేకు చెప్పండి సమాధానం చెబుతారని చెప్పారు. దీనిపై భాస్కరరామారావు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, పిల్లి అనంతలక్ష్మి, నాయకర్ మొదలగు వారు గ్రామానికి వచ్చి వారి పాలనను వారు సాగించుకున్నారన్నారు. గ్రామంలో ఒక అనామకుడ్ని వెంట వేసుకుని పాలన చేస్తున్నారని అనడంతో ఆ అనామకుడు ఎవరంటూ ఎమ్మెల్యే వర్గీయులు బొడ్డు సతీష్, సత్తిరాజు తిరిగి ప్రశ్నించడంతో తోపులాట మొదలైంది. దీంతో పోలీసులు వెంటనే లాఠీచార్జి చేశారు. ఇరువర్గాల వారిని అక్కడ నుంచి తరిమి వేశారు. ఎమ్మెల్యే టీడీపీ నేత బొడ్డు సత్తిరాజు ఇంటికి వెళ్లారు. బొడ్డు భాస్కరరామారావును పోలీసుల పర్యవేక్షణలో ఇంటికి పంపించేశారు. దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. అవినీతి పరుడిగా ఎమ్మెల్యే... పార్టీలో వ్యక్తుల మధ్య గొడవలు జరిగితే వాటిని పరిష్కరించకుండా తప్పుడు కేసులు పెట్టించి నాయకులను పార్టీకి దూరం చేస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై అధిష్టానికి ఫిర్యాదు చేస్తానని బొడ్డు భాస్కరరామారావు విలేకర్లకు తెలిపారు. ఎమ్మెల్యే తీరును ఖండిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే పెద్ద అవినీతి పరుడిగా తయారయ్యారంటూ ఆరోపించారు. ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తామన్నారు. -
అనపర్తిలో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు
అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. అనపర్తి అసెంబ్లీ సీటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నల్లమిల్లి టిక్కెట్ ఇవ్వకుంటే మూకుమ్మడి రాజీ నామాలు చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. అనపర్తి మండల అధ్యక్షుడు కర్రి ధర్మారెడ్డితో సమావేశమైన తెలుగు తమ్ముళ్లు ఈ మేరకు హుకుం జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తుండడంతో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు స్థానిక నేతలు కలవరపడుతున్నారు. అనపర్తి అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎ.ముక్తేశ్వరరావు పోటీ చేస్తున్నారు. -
నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఝలక్
అనపర్తి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలకు వరుస షాక్ లు ఇస్తున్నారు. టికెట్ పై గతంలో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకోవడం ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు తీరుతో భంగపడ్డ నేతల జాబితాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేరిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆయనకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. అక్కడి టికెట్ ను రామకృష్ణారెడ్డికి కాకుండా వేరేవారికి ఇవ్వడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆ టికెట్ ను రాష్ట్ర సర్పంచ్ లు మాజీ అధ్యక్షుడు పడాల రామారెడ్డి సతీమణి సునీతకు ఆ సీటును కేటాయించడంతో రామకృష్ణారెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం ఆందోళన బాటపట్టారు. పార్టీ కోసం కష్టపడే వారికి బాబు టికెట్లు ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు.