నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఝలక్ | nallamilli ramakrishana reddy stunned at chandra babu naidu decision | Sakshi
Sakshi News home page

నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఝలక్

Published Sun, Apr 13 2014 9:07 PM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM

nallamilli ramakrishana reddy stunned at chandra babu naidu decision

అనపర్తి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలకు వరుస షాక్ లు ఇస్తున్నారు. టికెట్ పై గతంలో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకోవడం ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు తీరుతో భంగపడ్డ నేతల జాబితాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేరిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆయనకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. అక్కడి టికెట్ ను రామకృష్ణారెడ్డికి కాకుండా వేరేవారికి ఇవ్వడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

 

ఆ టికెట్ ను రాష్ట్ర సర్పంచ్ లు మాజీ అధ్యక్షుడు పడాల రామారెడ్డి సతీమణి సునీతకు ఆ సీటును కేటాయించడంతో రామకృష్ణారెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం ఆందోళన బాటపట్టారు. పార్టీ కోసం కష్టపడే వారికి బాబు టికెట్లు ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement