
సాక్షి, తూర్పుగోదావరి : అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హత్య కేసుకు సంబంధించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల కిత్రం నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బావ వరుస అయిన సత్తిరాజు రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ హత్య కేసులో రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తూ సత్తిరాజురెడ్డి సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరిపి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం రామకృష్ణారెడ్డిని కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని కాకినాడ సబ్‌జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment