
సాక్షి, అనపర్తి/తూర్పు గోదావరి : మండలంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. వివాహేతర సంబంధం వ్యవహారంపై కొప్పవరంలో టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ నేతలు వెంకట్రామిరెడ్డి, సర్రెడ్డి వర్గీయులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. వివాహేతర సంబంధంలో సెటిల్‌మెంట్ బెడిసికొట్టడంతో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనలో ఎంపీటీసీ సర్రెడ్డికి గాయలయ్యాయి. దీంతో వెంకట్రామిరెడ్డి ఇంటిపై సర్రెడ్డి వర్గీయులు దాడికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో టీడీపీ మండలాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తలకు గాయమైంది. ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఘర్షణలు చెలరేగకుండా గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడానికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment