సాక్షి, విజయవాడ: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. వన్‌టౌన్ నైజాం గేట్ మసీదు సెంటర్ వద్ద ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ సంస్థ సభ్యుడు.. చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు హయాంలో 35 గుళ్లతో పాటు రామవరప్పాడు వద్దనున్న అబూబకర్ మసీద్‌ను కూడా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వచ్చారని చంద్రబాబును ఆయన నిలదీశారు.
కాగా, పరిపాలన రాజధానిగా ఎంపికైన విశాఖపట్టణానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు గత శుక్రవారం రాత్రి వైజాగ్ వాసులు షాకిచ్చిన సంగతి విదితమే. ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినదించారు. విశాఖ పట్టణానికి రాగా అతడిని గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కూడలిలో నిలబడి చంద్రబాబు పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే, గత నెల కుప్పం పర్యటనలో కూడా చంద్రబాబుకు ఊహించని దెబ్బ తగిలిన విషయం తెలిసిందే.. కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం విచ్చేసి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అర్ధంతరంగా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. పార్టీ శ్రేణులు తూటాల్లా సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ముఖం చాటేశారని పలువురు కార్యకర్తలు బహిరంగంగా చెప్పుకోవడం కనిపించింది.
చదవండి:
అపవిత్ర పొత్తు: సైకిల్ గుర్తు.. లేదంటే గ్లాస్ గుర్తు..!
ప్రజలపై అక్కసు.. చంద్రబాబు శాపనార్థాలు
Comments
Please login to add a commentAdd a comment