ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకు నివాళులర్పించడానికి స్థానిక శివాజీ పార్క్‌కు వెళ్లిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. శివాజీ పార్క్ వెలుపల శివసేన కార్యకర్తలు ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాల్ ఠాక్రే 7వ వర్ధంతి సందర్భంగా ఆదివారం శివాజీ పార్క్‌కు సహచర బీజేపీ నేతలతో కలిసి ఫడ్నవీస్ వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ శివసేన సీనియర్ నేతలెవరూ లేరు. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిగత కార్యదర్శి మిలింద్ నర్వేకర్ మాత్రం ఉన్నారు. అంతకుముందు, బాల్ ఠాక్రే ప్రసంగాల వీడియోలను ట్వీటర్‌లో ఫడ్నవీస్ షేర్ చేశారు. కాగా, బాల్ ఠాక్రేకు బీజేపీ, శివసేన నేతలు వేర్వేరుగా నివాళులర్పించారు. ఉదయం పదిగంటల సమయంలో బాల్ ఠాక్రే కుమారుడు, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన కుటుంబ సభ్యులతో కలిసి శివాజీ పార్క్‌లో నివాళులర్పించగా, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాల్ ఠాక్రేకు నివాళులర్పించేందుకు ఫడ్నవీస్ శివాజీ పార్క్‌కు వెళ్లారు.
శివాజీ అందరివాడు
ఛత్రపతి శివాజీ ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క కులానికో చెందినవాడు కాదని శివసేన వ్యాఖ్యానించింది. శివాజీ 11 కోట్ల మరాఠీలకు చెందినవాడని స్పష్టం చేసింది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ శివసేన ఎంపీ సంజయ్‌రౌత్, పార్టీ పత్రిక ‘సామ్నా’లో ‘రోక్‌తోక్’ అనే తన కాలమ్‌లో పై వ్యాఖ్యలు చేశారు. ‘
నేడు పవార్, సోనియా భేటీ
పుణె: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ కానున్నారు. వీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చించనున్నారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు మంగళవారం సమావేశమై, ప్రభుత్వ ఏర్పాటు ప్రాతిపదికలపై చర్చిస్తారన్నారు.
ఫడ్నవీస్‌కు చేదు అనుభవం
Published Mon, Nov 18 2019 3:55 AM | Last Updated on Mon, Nov 18 2019 3:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment