Bal Thackeray anniversary of the death
-
Bal Thackeray: సీఎంనే మందు పార్టీ అడిగిన బాల్ ఠాక్రే
న్యూఢిల్లీ: బాల్ ఠాక్రే.. మహారాష్ట్ర రాజకీయాల్లో శక్తివంతమైన నేతగా పేరుగాంచారు. నేడు (నవంబర్ 17) ఆయన వర్థంతి. 1926 జనవరి 23న జన్మించిన ఆయన 2012 నవంబర్ 17న కన్నుమూశారు. ఒకానొక సమయంలో బాల్ ఠాక్రే మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు.మహారాష్ట్ర సీఎం పదవిలో ఎవరున్నా బాల్ ఠాక్రే ఆధిపత్యమే కొనసాగేదని చెబుతుంటారు. ప్రముఖ జర్నలిస్టు సుజాతా ఆనందన్ 'హిందూ హృదయ సామ్రాట్ - హౌ ది శివసేన ఛేంజ్డ్ ముంబై ఫర్ ఎవర్’ అనే పుస్తకాన్ని రాశారు. దానిలో ఆమె బాల్ ఠాక్రేకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెలియజేశారు. బాల్ ఠాక్రే బహిరంగంగా బీరు తాగేందుకు, సిగరెట్లు కాల్చేందుకు ఏమాత్రం మొహమాటపడేవారు కాదని సుజాతా ఆనందన్ ఆ పుస్తకంలో తెలిపారు. ఈ రెండూ అంటే బాల్ ఠాక్రేకు ఎంతో ఇష్టమని, ఆయన అందరి ముందు మద్యం తాగేవారని ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు.అది 1995. బాల్ ఠాక్రే పార్టీ గెలిచింది. దీంతో ముంబైకి చెందిన బిల్డర్ నిరంజన్ హీరానందాని తండ్రి డాక్టర్ ఎల్ హెచ్ హీరానందాని ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో గొంతు తడపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బాల్ ఠాక్రే కోరారు. వెంటనే హీరానందానీ.. ‘పార్టీకి సీఎం వస్తారు. వారి సమక్షంలో మద్యం ఎలా తాగగలం?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన బాల్ ఠాక్రే నేరుగా సీఎం మనోహర్ జోషితో ‘ఏంటి మనోహర్.. మీరేమీ తాగరా’ అని ప్రశ్నించారు. ఈ మాట వినగానే సీఎం అవాక్కయ్యారు. తరువాత బాల్‌ఠాక్రే డాక్టర్ హీరానందానీతో మనం ఇప్పుడిప్పుడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. కనీసం షాంపైన్ అయినా ఏర్పాటు చేయాలి అని అన్నారు. దీంతో ఫ్రూట్ జ్యూస్ పార్టీ కాస్తా మద్యం పార్టీగా మారిపోయింది.ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత -
ఫడ్నవీస్‌కు చేదు అనుభవం
ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకు నివాళులర్పించడానికి స్థానిక శివాజీ పార్క్‌కు వెళ్లిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. శివాజీ పార్క్ వెలుపల శివసేన కార్యకర్తలు ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాల్ ఠాక్రే 7వ వర్ధంతి సందర్భంగా ఆదివారం శివాజీ పార్క్‌కు సహచర బీజేపీ నేతలతో కలిసి ఫడ్నవీస్ వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ శివసేన సీనియర్ నేతలెవరూ లేరు. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిగత కార్యదర్శి మిలింద్ నర్వేకర్ మాత్రం ఉన్నారు. అంతకుముందు, బాల్ ఠాక్రే ప్రసంగాల వీడియోలను ట్వీటర్లో ఫడ్నవీస్ షేర్ చేశారు. కాగా, బాల్ ఠాక్రేకు బీజేపీ, శివసేన నేతలు వేర్వేరుగా నివాళులర్పించారు. ఉదయం పదిగంటల సమయంలో బాల్ ఠాక్రే కుమారుడు, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన కుటుంబ సభ్యులతో కలిసి శివాజీ పార్క్‌లో నివాళులర్పించగా, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాల్ ఠాక్రేకు నివాళులర్పించేందుకు ఫడ్నవీస్ శివాజీ పార్క్‌కు వెళ్లారు. శివాజీ అందరివాడు ఛత్రపతి శివాజీ ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క కులానికో చెందినవాడు కాదని శివసేన వ్యాఖ్యానించింది. శివాజీ 11 కోట్ల మరాఠీలకు చెందినవాడని స్పష్టం చేసింది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ శివసేన ఎంపీ సంజయ్‌రౌత్, పార్టీ పత్రిక ‘సామ్నా’లో ‘రోక్‌తోక్’ అనే తన కాలమ్‌లో పై వ్యాఖ్యలు చేశారు. ‘ నేడు పవార్, సోనియా భేటీ పుణె: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ కానున్నారు. వీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చించనున్నారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు మంగళవారం సమావేశమై, ప్రభుత్వ ఏర్పాటు ప్రాతిపదికలపై చర్చిస్తారన్నారు. -
బాల్ ఠాక్రే వర్ధంతి సభకు ముమ్మర ఏర్పాట్లు
సాక్షి, ముంబై: ఈ నెల 17న జరగనున్న బాల్ ఠాక్రే రెండో వర్ధంతి కార్యక్రమానికి శివసేన నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలకు ఆ రోజు ఎలాంటి అసౌకర్యాలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా శివసేన పదాధికారులతో మేయర్ స్నేహల్ ఆంబేకర్ సమావేశమయ్యారు. శివాజీపార్క్ మైదానంలో చేపడుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా, ఆ రోజు హాజరయ్యే అభిమానులు ఇబ్బందులకు గురికాకుండా పార్క్ వద్ద అదనంగా మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సిబ్బందిని మోహరించాలని, అక్కడక్కడ నీటి కుళాయిలు, సంచార మరుగుదొడ్లు, మొబైల్ చార్జర్ల వ్యవస్థ, నీటి ట్యాంకర్లు తదితర సదుపాయాలు కల్పించాలని ఆంబేకర్తో శివసేన నాయకులు విజ్ఞప్తి చేశారు. మైదానంలో ఎటువంటి తోపులాటలు జరుగకుండా బారికేడ్లు ఏర్పాటుచేయాలని, తగినంత పోలీసు సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ మేరకు ఆంబేకర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.