
కళ్యాణదుర్గం: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె మాట్లాడారు. ఘటన జరిగిన వెంటనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి.. మంత్రులను బాధితురా లి వద్దకు పంపి ఆమెకు భరోసానిచ్చినట్టు చెప్పా రు. అలాగే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించారని తెలిపారు.
బాధిత కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి సహకారం అందించడంతో పాటు, కుటుంబానికి ఆసరా కల్పిస్తామని భరోసా ఇచ్చినట్టు వివరించారు. అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. బాధి తురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై చంద్రబాబు, ఆయన అనుచరులు దాడి చేయడం దారుణమని, రాజకీయం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.