
వైఎస్ఆర్ సీపీలో చేరిన ఉషశ్రీ చరణ్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఉషశ్రీ చరణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాద్లోని లోటస్పాండ్ వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.
ఉషశ్రీ వెంట కుటుంబ సభ్యులు, అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సీపీ నాయకులు ఉన్నారు. ఉషశ్రీ చరణ్ సొంతూరు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం.