డబ్బు పెట్టారు.. తీశారు | 'ATM' staff theft to money | Sakshi
Sakshi News home page

డబ్బు పెట్టారు.. తీశారు

Published Tue, May 5 2015 4:23 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

డబ్బు పెట్టారు.. తీశారు

డబ్బు పెట్టారు.. తీశారు

‘ఏటీఎం’ సిబ్బంది చేతివాటం
నిందితుల రిమాండ్  రూ. 73 లక్షల రికవరీ

 
 నాచారం:   అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేశారు.. ఇటీవల ఏటీఎంలలో డబ్బులు పెట్టే ఉద్యోగులు చోరీకి పాల్పడిన కేసు నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు వివరాలు వెల్లడిస్తూ సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం అల్వాల్ డీసీపీ రమారాజేశ్వరి, మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని  ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన మద్దెల సుధీర్(24), గొల్ల మనోజ్(24), హైదరాబాద్ నేరేడ్‌మెట్‌కు చెందిన ముత్త అశోక్(26) చెందిన క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్(సీఎంఎస్) సంస్థలో కస్టోడియన్‌లుగా ఈసీఐఎల్ రూట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 2014 ఏప్రిల్ నుంచి 2015 మార్చి వరకు ఈ ఉద్యోగులు  23 ఏటీఎంలలో రూ.1.49 కోట్లు మాయం చేశారు. ముంబాయిలోని సీఎంఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆడిట్‌లో ఏటీఎంలలో పెట్టిన డబ్బులకు, డ్రా చేసిన డబ్బులకు భారీగా తేడా రావడంతో గత ఏప్రిల్ 19న నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను నాచారం పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  వారి వద్ద నుండి రూ.73 లక్షలు రికవరీ చేశారు. దొంగిలించిన డబ్బుతో స్నేహితులతో కలసి గర్రపు పందేలు, ఇతర జల్సాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
 
చోరికి పాల్పడింది ఇలా...


నిందితులు ఏటీఎంలలో డబ్బులు పెట్టే సమయంలో ఇద్దరు ఉంటారు. వారికి వేర్వేరుగా సీక్రెట్ కోడ్ ఉంటుంది.  ఎవరి కోడ్ నెంబర్ వారు ఏటీఎం మిషన్‌లో కొడితే ఈ మిషన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు వారు డబ్బులు పెట్టి వెంటనే సీఎంఎస్ ప్రధాన కార్యాలయానికి మెసేజ్ (ఎస్‌ఎంఎస్ ) పంపుతారు. జల్సాలకు అలవాటు పడిన సుధీర్ డబ్బులు కాజేయడానికి పథకం రూపొందించాడు.  డబ్బులు పెట్టిన అనంతరం ఆ ముగ్గురిలో ఒకరిని ఏటీఎంకు పంపి వారి వద్ద ఉన్న రెండు కోడ్ నంబర్లను చెబుతారు. అతడు మిషన్‌లను ఒపెన్ చేసి ఇష్టం వచ్చినంత డబ్బును నేరుగా తీసుకుంటాడు.. దర్యాప్తు ప్రారంభించిన నాచారం పోలీసులు నిందితులను వారి నివాసంలో అరెస్ట్ చేశారు. సుధీర్ నుండి 87లక్షలు, అశోక్ నుండి 6 లక్షలు, మనోజ్ నుండి 10లక్షల రూపాయలు రికవరీ చేశారు. ఇంకా 76 లక్షల రూపాలు రికవరీ కావలసి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement