తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకునేందుకు కార్యచరణ రూపొందిస్తామని టి.జేఏసీ కన్వీనర్ ప్రొ.కోదండరాం వెల్లడించారు. శనివారం నగర శివారులో నాచారంలోని నోమ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఐకాస విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. న్యూఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలంగణావాదులకు సూచించారు.
ఆ అంశంపై ఈ రోజు సమావేశంలో సమీక్ష జరుపతామన్నారు. అయితే ఈ రోజు జరిగే ఆ సమావేశంలో ఈ నెల 30న నిర్వహించనున్న సదస్సు, హైదరాబాద్ ఉమ్మడి రాజధానితోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న అనంతరం ఏర్పడిన పరిణామాలపై చర్చించనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కేకేతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఆ సమావేశానికి హాజరయ్యారు.