
నిహారికకు కేకు తినిపిస్తున్న అభిమాని
నాచారం: నాచారంలోని సాధన మానసిక వికలాంగుల పాఠశాలలో ఆదివారం మెగాస్టార్ పుట్టినరోజును వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాగబాబు తనయ నిహారిక, హాస్యనటుడు వేణుమాధవ్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఎం.సందీప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిహారిక కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం, వృద్ధాశ్రమంలో పండ్లు పంచారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
తమ పెదనాన్న పుట్టిన రోజును ఇంతమంది మధ్య నిర్వహించడం ఆనందంగా ఉందని నిహారిక పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జీ బండారి లకా్ష్మరెడ్డి, బస్వరాజ్ శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి సాయిజెన్ శేఖర్, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.