దొంగతనం నాటకంతో అడ్డంగా దొరికిపోయాడు..
Published Mon, Nov 14 2016 6:32 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
హైదరాబాద్: ఓ వ్యక్తి తన వద్దు ఉన్న నగదును ఎవరో దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేసి...అడ్డంగా బుక్కైయ్యాడు. నాచారంలోని ఆకాశ్‌స్టీల్స్‌లో శర్మ అనే వ్యక్తి సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతడు సోమవారం నేరేడ్‌మెట్‌లోని కొనుగోలు దారుల నుంచి సుమారు రూ.3.50 లక్షల నగదును వసూలు చేసుకున్నాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు డబ్బును ఎత్తుకుపోయారని, శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో శర్మను విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది. తానే ఆ సొమ్మును దాచినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.3.50 లక్షల డబ్బును రాబట్టి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
Advertisement
Advertisement