
11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
నాచారం: హైదరాబాద్లో ఓ పేకాట కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి 11 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. మల్లాపూర్ సూర్యానగర్‌లో నివాసం ఉండే భవననిర్మాణ కార్మికులు గత కొన్ని రోజులుగా పేకాట ఆడుతున్నారు.
దీనిపై పక్కా సమాచారంతో ఆదివారం సాయంత్రం సూర్యానగర్‌లోని పేకాట కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 11మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 10 సెల్‌ఫోన్లు, రూ. 9,070 నగదును స్వాధీనం చేసుకుని నాచారం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.