card players
-
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
కంకిపాడు: కృష్ణాజిల్లాలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో ఆదివారం పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 4 వేల నగదుతో పాటు ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 17 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మరిన్ని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. -
16 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
మహబూబ్నగర్: పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు 16 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 36 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడూరు, బొక్కలోనిపల్లి గ్రామాలలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు స్థావరాలలో పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. -
11 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
నాచారం: హైదరాబాద్లో ఓ పేకాట కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి 11 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. మల్లాపూర్ సూర్యానగర్లో నివాసం ఉండే భవననిర్మాణ కార్మికులు గత కొన్ని రోజులుగా పేకాట ఆడుతున్నారు. దీనిపై పక్కా సమాచారంతో ఆదివారం సాయంత్రం సూర్యానగర్లోని పేకాట కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 11మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 10 సెల్ఫోన్లు, రూ. 9,070 నగదును స్వాధీనం చేసుకుని నాచారం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పేకాట స్థావరంపై దాడి, నలుగురి అరెస్ట్
అచ్చంపేట : మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట పోలీసులు నలుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. స్థానిక కేరళ పాఠశాల సమీపంలోని ఓ ఇంటిపై శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు బైక్లు, సెల్ఫోన్లతోపాటు రూ.30,370 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
హయత్నగర్లో పేకాటరాయళ్ల ఆరెస్ట్