
16 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
మహబూబ్‌నగర్: పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు 16 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 36 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
కోడూరు, బొక్కలోనిపల్లి గ్రామాలలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు స్థావరాలలో పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందుతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు.