
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
కంకిపాడు: కృష్ణాజిల్లాలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. కంకిపాడు మండలం గొడవర్రు గ్రామంలో ఆదివారం పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 4 వేల నగదుతో పాటు ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులపై కేసులు నమోదు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు.
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం రాత్రి పేకాట ఆడుతున్న ఆరుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 17 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మరిన్ని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు.