అచ్చంపేట : మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట పోలీసులు నలుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. స్థానిక కేరళ పాఠశాల సమీపంలోని ఓ ఇంటిపై శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు బైక్‌లు, సెల్‌ఫోన్లతోపాటు రూ.30,370 నగదును స్వాధీనం చేసుకున్నారు.